Others

జంతు సంరక్షణలో నిర్లక్ష్య ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిందితుడు సల్మాన్ ఖాన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడు. అతడిని ఆరాధించేవారు లక్షల్లో వున్నారు. నేరానికి పాల్పడిన సల్మాన్‌ను శిక్షించకపోతే అభిమానులు అతడిని అనుసరించే ప్రమాదం వుంది. అందువల్ల అతడి నేరాన్ని తీవ్రంగా పరిగణించి జైలుకు పంపుతున్నా’మని న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం హర్షణీయం. పేరుప్రఖ్యాతులున్నవాడు ఒక్కరోజు జైలుశిక్ష అనుభవించినా అతని జీవితంలో ఒక మాయని మచ్చగానే ఉంటుంది. జంతువుల్ని కిరాతకంగా వధించే వారికి చెంప పెట్టులాంటిది కోర్టుతీర్పు. నటన వేరు, జీవితం వేరు. జీవితంలో నటించకూడదు. నటనలో జీవించవచ్చు. వన్యప్రాణుల వధ దేశంలో అక్కడక్కడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందరో బడాబాబులు రహస్యంగా వేటాడిన దుశ్చర్యలు ఎన్నో వెలుగులోకి రావడం లేదు. వచ్చినా తెరవెనుక జరిగే కుట్రలెన్నో!
ఏనుగుల దంతాలు పీకేసి కోట్లాది రూపాయల వ్యాపారం సజావుగా జరిగిపోతూనే వుంది. ఎన్ని ఏనుగులు వధించబడుతున్నాయో లెక్కలేదు. 1964లో భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించినా, వాటిని హతమార్చడానికి ఎవరూ వెనుకాడడం లేదు. పులిచర్మాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. బాధ్యత వహించవలసిన వారే పక్కదారులు వెతుక్కుంటుంటే, వన్యప్రాణుల్ని కాపాడుకోవడం ప్రశ్నార్థకమేనా? 15వ శతాబ్దంలో బికనీరుకు చెందిన గురు జంబేశ్వర్ ఈ బిష్ణోయ్ వన్యప్రాణుల రక్షణకు కొత్త సంప్రదాయాన్ని ఆరంభించారు. మూగజీవాలు, ప్రకృతిని పరిరక్షించడానికి 29 సిద్ధాంతాలు ఆయన ప్రవేశపెట్టారు.
క్రీ.శ.1730లో అప్పటి జోథ్‌పూర్ మహారాజు తన ప్యాలస్ నిర్మాణానికి ఖేజ్రీ చెట్లను కొట్టేయమని ఆదేశించాడు. వాటినెంతో పవిత్రంగా భావించే బిష్ణోయ్‌లు ఏకంగా రాజునే ధిక్కరించారు. అమృతాదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు రాజుకు ఎదురు తిరిగినందుకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. శాకాహారులైన బిష్ణోయ్‌లు లేగ దూడలను, జింకలను తమ ప్రాణంలా చూసుకుంటారు. 500 ఏళ్ళ క్రితం గురు జంబేశ్వర్ తమ సామాజిక వర్గం వారిచేత ప్రకృతిని, మూగజీవాలను కాపాడుకుంటామని ప్రమాణం చేయించారు. గతంలో ఖమ్మం జిల్లాలో కొందరు ప్రముఖులు జంతువుల్ని వధించి విందు భోజనం ఆరగించారు.
కోర్టు తీర్పులు ఎప్పుడూ కుల,మత, రాజకీయాలకు అతీతంగానే వుంటాయి. అందుకే చట్టాన్ని ఎవరైనా గౌరవించవలసిందే. అయితే, మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. పాపికొండలు, కోరంజ, కొల్లేరు, కృష్ణా, నాగార్జునసాగర్, రోళ్ళపాడు, గుండ్ల, బ్రహ్మశ్వర్యం, శ్రీలంక మల్లేశ్వర్, నేలపట్టు, పలికాట్, కౌండిన్య చిత్తూరులోని శ్రీపెవిసులు నరసింహ, కడప, నెల్లూరు ప్రాంతాల్లోను, కంబాలకొండ, శేషాచలం బయో రిజర్వ్ ఇలా అన్నింటా వన్యప్రాణుల, జలచరాల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటేనే అందరికీ మేలు జరుగుతుంది. నిర్లక్ష్యధోరణి కట్టిపెట్టి జంతుసంరక్షణ చర్యలు చేపట్టాలి. ఎన్ని కోర్టులున్నా, చట్టాలున్నా సమాజంలో అందరూ సత్‌ప్రవర్తన కలిగి ఉండాలి.

- అడపా రామకృష్ణ సెల్: 95052 69091