Others

ఆశీర్వాదమునకు వారసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి’ - 1 పేతురు 3:9 మనకు దేవుని దీవెనలు కావాలంటే, ముందు మనం మన తోటివారిని దీవించాలి. ఆశీర్వాదమునకు వారసుడగుటకే దేవుడు మనలను పిలుస్తున్నాడు. అయితే ఒక షరతు. ‘కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు’.
మానవుడి నైజం న్యూటన్ 3వ సూత్రంలా ఉంటుంది. ఉ్పళూక ఘషఆజ్యశ ద్ఘఒ ఘశ ళజిఖ్ఘ ఘశజూ యఔఔ్యఒజఆళ ళ్ఘషఆజ్యశ. ఇతరులు ఏ విధంగా మాట్లాడితే, మనం కూడా అదే విధంగా మాట్లాడతాం. వారు సమాధానంగా మాట్లాడితే, మనమూ సమాధానంగా మాట్లాడతాం. వాళ్లు కోపంగా మాట్లాడితే, మనమూ కోపం తెచ్చుకొంటాం. వారు కోపంగా మాట్లాడుతున్నారని, మనమూ నిష్ఠూరంగానూ కోపంగానూ మాట్లాడాల్సిన అవసరం ఉందా? తన కోపమె తన శత్రువు సూత్రాన్ని మనం ఎందుకు పాటించలేక పోతున్నాం? ఎదుటి వ్యక్తి నిష్ఠూరపు మాటల్తో.. కోపంగా మాట్లాడినప్పటికీ శాంతంగా సమాధానంగా మాట్లాడమని బైబిల్ సెలవిస్తోంది.
ఇందుకు యేసు ప్రభువు శాంత స్వభావమే ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన్ని ద్వేషించి, హేళనగా మాట్లాడి.. కొరడాలతో కొట్టి - శిలువ మ్రానుపై వ్రేలాడదీసినప్పటికీ ఆయన వారి మీద కోపం తెచ్చుకోలేదు. పరుషంగా మాట్లాడలేదు. ద్వేషించలేదు. ఆయనను పోలి నడుచుకోవటానికి ప్రయత్నిద్దాం. ప్రేమగా మాట్లాడుదాం. కీడుకు ప్రతి కీడు చేయవద్దంటున్నాడు యేసు ప్రభువు. ప్రత్యక్షంగా కీడే చేయనవసరం లేదు. ఎదుటి వ్యక్తి కి అలా జరిగితే బావుణ్ణు. ఇలా జరిగితే బావుణ్ణు అని వచ్చే ఆలోచనలు సైతం కీడును కలిగించేవే. ఎదుటి వ్యక్తికి కష్టం కలిగితే బాధ పడటం మాని సంతోషిస్తాం. ‘మా బాగా జరిగింది’ అని ఉడుకుమోత్తనం ప్రదర్శిస్తాం. అది కూడా కీడు తలపే.
కనుక - దీవించటం నేర్చుకొందాం. దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఒకరిని ఒకరు ప్రేమించుకొన్నట్టే.. ఒకరిని ఒకరు దీవించుకోగలగాలి. దేవుని ఆశీర్వాదం లేకపోయినా ఫర్వాలేదు - ఎదుటి వాడు మాత్రం బాగుపడకూడదు. ఇలా మాటకు మాట అనవలసిందే. కోపాన్ని ప్రదర్శించవలసిందే. ఈ ధోరణిలో ఈ ఆలోచనల్లో ఎన్ని యుగాలైనా మార్పు రావటంలేదు. ఐతే - ప్రభువు ఆశీర్వాదం కావాలంటే ‘ఇగో’ని పక్కన పెట్టాల్సిందే. ‘ఇగో’ అన్ని వ్యసనాలకూ కోప తాపాలకూ ప్రధాన కారణం. దాన్ని పక్కనపెడితే అంతా ప్రశాంతతే. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అన్నది సామెత. ఘరీ జశ -్ఘకళూ యౄజూళ ళ్పళశ జశ ఘశళూ. ఈ సూత్రాన్ని ఫాటిస్తే - కచ్చితంగా కోపాన్ని అదుపులో తెచ్చుకొనేందుకు వీలవుతుంది. కాబట్టి - నాలుకకు పర్మిషన్ ఇవ్వకండి. అదుపులో పెట్టుకోండి. మనం విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు ఒక్కసారి మన మాటల్ని మనం రికార్డ్ చేసుకొని మళ్లీ వినండి. ఎంత విచక్షణా రహితంగా.. కోపంలో ఎనె్నన్ని వ్యర్థమైన మాటల్ని పలికామో చూడండి. నేనేనా ఇలా మాట్లాడింది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొనే పరిస్థితి ఎదురవుతుంది. అప్పటికి ‘ఇగో’ కోపం చల్లారినప్పటికీ.. దాని పర్యవసానం ఎంతటి విపరీత పరిణామాలను ఎదుర్కొన్నదో అర్థమవుతుంది. క్షణికావేశంలో పలికే మాటల వల్ల, కోపం వల్ల దేవుని ‘ఆశీర్వాదాన్ని’ మనం పోగొట్టుకొంటున్నాం అన్న విషయం అర్థమయితే ‘కోపం’ జోలికి వెళ్లనే వెళ్లం. ఒక్క క్షణం ఆలోచించండి. కోపంలోనే బ్రతుకుదామా? దేవుని ఆశీర్వాదాలను పొందుకొందామా? *

-మద్దు పీటర్ 9490651256