AADIVAVRAM - Others

ఐస్ కేవ్స్.. కెవ్వు కేక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడున్న గుహలను చూశారా! చూడటానికే వామ్మో.. వాయ్యో అనిపిస్తుంది కదూ.. కానీ సాహసాలంటే ఇష్టం ఉన్నవారికీ, ట్రెక్కింగ్స్ చేయాలని మోజు పడేవారికి మాత్రం భలే సరదాగా ఉంటుంది. ఈ గుహలు అమెరికాలోని అపోస్టెల్ ఐస్‌లాండ్స్‌లో ఉంటాయి. ఈ సముద్ర మంచు గుహలు సహజంగా ఏర్పడినవే! సముద్రపు నీరు తరంగాల రూపంలో గుహలపై పడుతుంది. రాతిపై పడిన నీరు, ఇసుక మేటల్లోని ఖనిజాలు, గుహల్లోని సున్నపురాయి వలన రసాయన చర్యకు లోనై.. వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఆ నీరు మంచుముద్దలుగా, వివిధ రంగుల్లోకి మారుతుంది.
ఈ గుహలు నేషనల్ లేక్‌షోర్ వారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఇక్కడికి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. శనివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సెలవురోజుల్లో మేయర్స్ బీచ్ రోడ్డులో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి. ఇక్కడి అందాలను ఫొటోల్లో బంధించాలనుకునేవారు మాత్రం ఉదయం పదిగంటల తర్వాత వస్తే సూర్యకాంతి వల్ల గుహల్లోని రాతి, మంచు వివిధ రంగుల్లో కనిపిస్తుందని చెబుతారు ఇక్కడివారు. అన్ని ఋతువుల్లో ఇక్కడికి అనుమతి ఉండదు. కారణం మంచు ఎక్కువగా ఉన్న పరిసరాల్లో వాతావరణ మార్పులు చాలా త్వరగా సంభవిస్తాయి. అంటే ఉష్ణోగ్రతలు, వాయువేగం, వేడిగాడ్పులలో తేడాలు వచ్చినప్పుడు మంచు వాతావరణం చాలా త్వరగా ప్రభావానికి గురవుతుంది. అందుకే ఇక్కడికి అనుమతించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు చాలా తీసుకుంటారు పర్యాటకశాఖవారు. వెళ్ళినవారు కూడా వారు చెప్పిన జాగ్రత్తలను పూర్తిగా పాటిస్తే మంచింది.
ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్పైక్స్ బూట్లు వేసుకోవడం వల్ల మంచులో కాళ్ళు కూరుకుపోకుండా, జారిపోకుండా ఉండొచ్చు. పెద్దపెద్ద ఐసికిల్స్, ఘనీభవించిన జలపాతాల కింద నిల్చుకోకుండా ఉంటే మంచిది. క్షణాల్లోనే మంచు చరియలు విరిగిపడ్డమో, లేదా కరిగిన మంచు జలపాతాల్లా కాకుండా ఐసుగడ్డల రూపంలో పడటం జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో పైన మంచుగడ్డలు కనిపిస్తాయి. లోపల నీరు నిండి ఉంటుంది. దానిపై కాలు పెట్టామా.. అంతే సంగతులు! కాబట్టి ఇక్కడ నడిచేటప్పుడు తప్పనిసరిగా పర్యాటక శాఖవారు సూచనలు పాటించాలి. ఇక్కడికి వెళ్ళేవారు తమ బాగుల్లో తప్పనిసరిగా ప్రథమచికిత్స కిట్, కొంత ఆహారం, మంచినీళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో అక్కడున్న మంచును పగలకొట్టాలని చూడకూడదు.
ఇటువంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మీరు వెళ్ళే సాహసోపేతమైన యాత్ర అందమైన మధురానుభూతులను మిగులుస్తుంది.