Others

నదురు బెదురు లేక...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**నాలుగైదు పెద్ద వెల్లుల్లి రేకలను మెత్తగా పేస్టులా చేసి ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయ్యాక తలకు తెల్ల నూలు తువ్వాలు కనీసం 2, 3 గంటలు లేదా రాత్రంతా ఉంచి ఉదయానే్న శుభ్రంగా తలస్నానం చేయాలి. ఈ తల స్నానం కుంకుడు రసంతోనో సీకాయ నానబెట్టి రుబ్బిన రసంతోనో చేయాలి. ఇలా రెండు రోజులకోమారు వారంపాటుచేస్తే పేలే కాక వాటి గుడ్లు కూడా చచ్చిపోతాయి.
=======

స్కూల్స్ మొదలైయ్యాయ అంటే ఇక పిల్లల తలల్లో పేలు ముదరిపోతుంటాయ. చెమటకు పుట్టే ఈ జీవాలు లెక్కకు మించి అతివేగంగా ప్రాణంపోసుకుంటూ ఉంటాయ. పేను శాస్ర్తియ నామం ‘పెడిక్యులర్ హ్యూమనస్ కాపిటిస్’. ఈ జీవులకు మూడు జతల కాళ్ళు, కాళ్ళచివర గోళ్ళు వంపు తిరిగి, వాటితో తలలో వెంట్రుకలను, తలమీది చర్మాన్ని పట్టుకొను అనుకూలంగా వుంటాయి. ఆడ పేను 80-100 వరకూ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు తల వెంట్రుకలను గట్టిగా పట్టుకుని ఉంటాయి. ఈ గుడ్లు తెల్లగా తళతళా మెరుస్తూ ఉంటాయి. వీటినుంచి వారం రోజుల్లో పిల్ల పేలు పుడతాయి. ఇవి ఒకరినుంచి మరొకరి దువ్వెనలు, వస్తువులు, ధరించే దుస్తుల ద్వారా ఇతరులకు చేరుతుంటాయి. రిలాప్సింగ్ జ్వరం, రికెట్సియాలవల్ల ఏర్పడే టైఫస్ జ్వరం వంటి వ్యాధిజనక జీవులను పేలు కలిగిస్తాయి. తలల్లో స్థిరనివాసం చేసుకునే ఈ పేల పీడ వదిలించుకోవడం కొంత కష్టమైనా కొన్ని గృహ వైద్యాల ద్వారా వదించుకోవచ్చు.
నాలుగైదు పెద్ద వెల్లుల్లి రేకలను మెత్తగా పేస్టులా చేసి ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయ్యాక తలకు తెల్ల నూలు తువ్వాలు కనీసం 2, 3 గంటలు లేదా రాత్రంతా ఉంచి ఉదయానే్న శుభ్రంగా తలస్నానం చేయాలి. ఈ తల స్నానం కుంకుడు రసంతోనో సీకాయ నానబెట్టి రుబ్బిన రసంతోనో చేయాలి. ఇలా రెండు రోజులకోమారు వారంపాటుచేస్తే పేలే కాక వాటి గుడ్లు కూడా చచ్చిపోతాయి.
పచ్చకర్పూరం లేదా హారతి కర్పూరాన్ని పొడిచేసి కొబ్బరి లేదా నువ్వుల నూనె కాచి చల్లారాక ఈ పొడి కలిపి తలలో చర్మానికి అంటేలా బాగా పట్టించాలి. అర్థగంట అయ్యక తలస్నానం కుంకుడు రసంతో చేస్తే సరి. ఇలా రోజు మార్చి రోజు లేదా వారంపాటు రోజూ చేస్తే పేల నివారణ జరుగుతుంది.
అరకప్పు నీళ్ళలో రెండు టీ స్పూన్ల వైట్ వెనిగర్ కలిపి, దాన్ని దూదితో ముంచి తలకు పట్టించి జుట్టు కుదుళ్లకు బాగా తగిలేట్లు మసాజ్ చేయాలి. 3, 4 గంటలు కానీ, రాత్రంతా తలకు నూలు తువాలు చుట్టి ఉంచి, కుంకుడు రసంతో ఉదయానే్న తలస్నానం చేయడంవల్ల పేల బాధ నివారణ అవుతుంది. ఒక వారం పాటు ఓపిగ్గా చేయాలి. అవే చేయిస్తాయి మనతో బద్ధకం వదలకొడతాయి.
పుల్ల పెరుగులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలలో జుట్టు కదుళ్ళవరకూ బాగా అంటేలా రుద్దాలి. తలకు ఒక తువ్వాలు చుట్టి కనీసం అర్థగంట అలాగే నాననివ్వాలి. చిన్న పిల్లలు అంతసేపు కూర్చోరు. వారికి టీవీనో, ఐప్యాడో ఇవ్వడం తప్పనిసరి. ఆ తర్వాత పేల దువ్వెనతో దువ్వితే పేలు బయటికి వచ్చేస్తాయి. కొన్ని చచ్చిపోతాయి.
పేలు తొలగించను ఉత్తమ మార్గం సన్నటి పళ్ళున్న దువ్వెతో దువ్వటమే! ఈపులను తీసేసే ఈర్పు అంటే పొడవాటి ఈర్పెన అనే చెక్క దువ్వెన ఉంటుంది. పాతకాలంలో వీటితనే పేలను, ఈపులనూ తొలగిచుకునేవారు. నేడు ఈ పేలను చంపేందుకు అనేక మందులు లభ్యమవుతున్నాయి. పైరెథిన్, పెర్మెన్,్ర బెంజిల్ ఆల్కహాల్ లోషన్, మలాథియాన్, లిండేన్- ఇలాంటి లోషన్స్‌గానూ, షాంపులుగానూ కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. పేలు ఉన్నవారు వాడుతున్న తువ్వాళ్ళూ, బట్టలు, దుప్పట్లు, పరుపు, కవర్లు, దిండు గలీబులు లాంటివన్నీ వేడినీళ్ళలో ఉతకాలి లేదా వాషింగ్ మిషన్‌లో వేయాలి. దువ్వెనలు, బ్రష్‌లు తదితరాలు వాడే వస్తువులన్నింటిని వేడి నీళ్ళలో కడిగి శుభ్రం చేయాలి. దువ్వెనల్ని వేర్వేరుగా వాడటం సర్వత్రా శ్రేయస్కరం. వారం వారం దువ్వెనలన్నీ సర్ఫ్ వేసిన వేడినీళ్ళలో నాననిచ్చి బ్రష్ చేసి ఎండలో ఉంచి వాడుకోవాలి. పేలు ఉన్నవారితో దగ్గరగా ఉండకపోవడం, తలలను దగ్గరగా చేర్చి మాట్లాడటం, దువ్వెనలు, హెయిర్ బ్రష్‌లు వ్యక్తిగతంగా వేరుగా ఉంచుకోవడం ఉత్తమం.
*