Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అథర్వవేదంలో ఒక చోట-
అణ్వాంత్య్రం శీర్షణ్యం
అథో పార్ష్ణేయం క్రిమీన్- అనే మంత్రం వుంది.
ఇది మనిషి పేగుల్లోనూ, పుర్రెలోనూ, పక్కటెముకల్లోనూ గల సూక్ష్మ క్రిములను గురించి ప్రస్తావిస్తోంది. ఇలాంటి సూక్ష్మక్రిముల అస్తిత్వాన్ని ఆధునిక లోకానికి మొదటిసారిగా తెలియపరచినవాడు 19వ శతాబ్దికి చెందిన పాశ్చర్ లూయిస్.
ఇలాంటి సూక్ష్మక్రిములను గుర్తించాలంటే, శక్తివంతమైన మైక్రోస్కోపుల వంటి సాధనాలుండాలి. అవి ఆధునిక లోకానికి అందుబాటులోకి వచ్చింది క్రీ.శ.13వ శతాబ్దిలో మాత్రమే. అప్పట్లో ఛాకన్ రోగరీ అనే వైజ్ఞానికుడు భూతద్దాలను, వాటి అమరికను కనిపెట్టాడు. కానీ బి.సి.3000 ప్రాంతాలకు చెందిన న్యాయ శాస్త్రంలో (లాజిక్ శాస్త్రంలో) ఇలాంటి అమరికను విస్పష్టంగా వర్ణించారు. అంతేగాక, ఈ రకమైన భూతద్దాల తయారీకి గాజును, అభ్రకాన్నీ, స్ఫటికాన్నీ కూడా వాడవచ్చునని వివరించారు. (అప్రాప్య గ్రహణం కాచాభ్రపటల స్ఫటికాంతరి తోపలబ్ధేః). దీన్ని బట్టి అథర్వణ వేదకాలం నాటికే మైక్రోస్కోపు వంటి సాధనాలు వుండేవని మనం ఊహించవచ్చు.
వేదాలలో సూటిగా వైజ్ఞానిక వాక్యాలున్నాయని చెప్పటానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాగే వేదం తరువాత వచ్చిన పురాణాలలోను, తంత్ర శాస్త్ర గ్రంథాలలోనూ, కావ్యాలలోనూ కూడా ఆయా సందర్భాలలో వివిధ విజ్ఞాన శాస్త్ర విశేషాల ప్రస్తావన చేసే వాక్యాలు వేల సంఖ్యలో వున్నాయి. ఐనా కూడా ఇవేవీ సూటిగా విజ్ఞానశాస్త్ర పాఠ్యగ్రంథాలు కావు గనుక, వీటిలో ఏ విషయానికి సంబంధించిన సమగ్ర చర్చగానీ, ప్రయోగాత్మక తాంత్రిక విశేషాలు (టెక్నికల్ డిటెయిల్సు) గానీ వుండవు. అవి లేనపుడు, ఈ ప్రస్తావన వాక్యాలవల్ల మనకు సమగ్ర ప్రయోజనం చేకూరదు. ఆనాటి వైజ్ఞానిక విధానాలను మనం ఈనాడు పునరావృత్తం చేసుకొనే వీలు కూడా కలగదు.
ఈనాడు ఆధునిక విజ్ఞానం ఊహకు అందనంత బ్రహ్మాండంగా పెరిగిపోయినప్పటికీ, ఈ విజ్ఞాన విస్తరణవల్ల సంభవిస్తున్న కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి ఇతర వ్యతిరేక ప్రభావాలు, ఈనాటి విజ్ఞాన శాస్తవ్రేత్తలను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాటి నివారణ కోసం వారు రకరకాల అనే్వషణలు చేస్తున్నారు. అందులో భాగంగా వారి దృష్టి పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలమీద కూడా పడుతోంది. అందుకు ప్రధాన కారణాలు- ఆనాటి భారతీయుల విజ్ఞాన వికాసం మనం ఊహించినదానికన్నా అధికంగానే వుందని గుర్తించటం, దానికి తోడు ఆ వికాసమంతా ప్రకృతి మైత్రీ సంపన్నంగా (నేచర్ ఫ్రెండ్లీ) వుండటం అనేవే.
పురాతన భారతీయ సాహిత్యంలో అలాంటి ప్రత్యేక వైజ్ఞానిక గ్రంథాలు వేల సంఖ్యలో వుండేవని గుర్తించటం జరిగింది. కానీ, చరిత్రలో జరిగిన అనేక విదేశీయ దాడులు వగైరా కారణాలవల్ల ఆనాటి తాళపత్ర గ్రంథాలలో అత్యధిక భాగం అగ్గిపాలు కాగా, అతి కొద్ది గ్రంథాలు మాత్రమే భారతదేశపు మూల మూలల్లో చెదురు మదురుగా దొరుకుతున్నాయి. వాటికోసం అనే్వషణ కూడా ఇపుడు ఒకింత పెరిగింది. అలా అనే్వషించగా ఇంతవరకూ దొరికిన గ్రంథాల అధ్యయనంవల్ల, ఆయా విజ్ఞాన శాఖల విషయంలో సనాతన భారతదేశంలో సాధించిన విజయాలలో కొన్ని ముఖ్య విషయాల గురించి ఇపుడు మనం కేవలం రేఖామాత్రంగా పరిచయం సంపాదించుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
వైదిక విజ్ఞాన శాఖల హరివిల్లు
మానవజాతి నాగరికత యొక్క అత్యంత పురాతనతమ వాఙ్మయానికే ‘వేదము’ అని పేరు. వేదాలకంటే పురాతనంగా వేరే నాగరికత ఏమైనా ఉన్నదా, లేదా అనే విషంలో వేడి వేడి చర్చలు కొన్నిచోట్ల ఇంకా జరుగుతూనే వున్నాయి. ఏది ఏమైనా భరతఖండం వరకు వేదాలే ప్రాచీనతమ వాఙ్మయం అనటంలో అభిప్రాయభేదాలు లేవు.
ఈ ఖండంలో వేదానంతరం వికసించిన సమస్త కార్యకలాపాలకూ, అవగాహనలకూ, సంస్కృతి ప్రస్థానాలకూ అన్నిటికీ వేదాలే ఆదిమూలంగా ఉంటూ వచ్చాయి. ఆ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. వేదాల బృహత్ప్రణాళకలో విజ్ఞానశాస్త్రం కూడా అంతర్భాగంగా వుందనే విషయం అలనాటి మేధావులకు తెలుసు. వారినే మహర్షులనీ, యోగులనీ, దివ్యదృష్టి సంపన్నులనీ ఈ జాతి అనాదికాలంగా గౌరవిస్తోంది.
ఈ సందర్భంగా వేదము అనే పదాన్ని మనం ప్రయోగించినపుడు ఈనాడు ఉపలభ్యమానమవుతున్న వేదరాశి మాత్రమే వేదము అనుకోవటానికి వీలులేదు. నిజానికి ప్రకృతి సత్యాలను అప్రయత్నంగా ప్రకటించే ఏ వాక్యమైనా వేదమే. అలాంటి వాక్యాలు మహర్షుల సమాధి స్థితిలో వారి హృదయ గుహలలో ప్రతిధ్వనించేవి. అలాంటి వాక్య సమూహంలో కొంత భాగం ఈనాడు మనకు గురుశిష్య అధ్యయన పరంపరలో అందుబాటులో వుంది. దానిని ‘జ్ఞాతవేదము’ అంటున్నారు. మరికొంత భాగం ఒకప్పుడు గురశిష్య పరంపరలో వుండేదిగానీ, ఇపుడు అది లభించటంలేదు. అలాంటి భాగాన్ని ‘న్టఃవేదము’ అంటున్నారు. ఈ నష్టవేదంలోని కొన్ని భాగాలమీద ఆధారపడి కొంతమంది మహర్షులు కొన్ని స్వీయరచనలు చేశారు. ఈ రచనలు మనకు దొరుకుతున్నాయి. ఈ రచనలను బట్టి వాటికి మూలమైన వేదభాగాలను ఊహించవచ్చు. అలా ఊహింపబడిన భాగాన్ని ‘అనుమతి వేదము’ అంటున్నారు.
వీటన్నిటినీ ఆధారంగా చేసుకున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు చారిత్రిక సత్యాలు మాత్రమే కాదు, అవి నిజానికి వైజ్ఞానిక ప్రతిపాదనలు కూడా. వీటిలో అంధవిశ్వాసాలకు చోటులేదు. ఈనాటి ఆధునిక వైజ్ఞానిక రచనలు ఎంత పటిష్టంగా వుంటాయో, ఆనాటి వైజ్ఞానిక రచనలు కూడా అంత నిర్దుష్టంగానే వుంటాయి.
ఈ వైజ్ఞానిక సత్యాలను పరిశోధనాత్మకంగా ఆవిష్కరించుకోవటం కోసం గత కొన్ని దశాబ్దాలుగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆవిర్భవిస్తూ వున్నాయి. వాటిలో ఐ సర్వ్ సంస్థ కూడా ఒకటి. సమస్త భౌతిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక విద్యా సంప్రదాయాలన్నింటికీ వేదమే ఆదిమూలమని వేదమే స్వయంగా ప్రకటిస్తోంది. నిజానికి వేదంలోగల ఆధ్యాత్మిక భాగం గాంభీర్యంలో గురుతరమే అయినప్పటికీ, ఆ వాఙ్మయంలో భౌతిక విజ్ఞాన విస్తారమే ఎక్కువ.
వేదభాష్య రచయితలలో విద్యారణ్యస్వామివారు సుప్రసిద్ధుదలు. వారు తమ అథర్వణ వేదభాష్య భూమికలో ఉపవర్షాచార్యులవారి శ్లోకం ఒకటి ఉదహరించారు. ఉపవర్షాచార్యులు ఆదిశంకరులకన్న ప్రాచీనులు. వేదార్థంమీద విస్తారమైన కృషి చేసినవారు. వారు, వేదంలోని ప్రతి మంత్రానికీ అయిదు కల్పాలు వుంటాయి అన్నారు. (కల్పము =అర్థం) ఆ అయిదు రకాల అర్థాలు ఏమిటంటే-
నక్షత్రకల్పో వైతానః తృతీయస్సంహితా విధిః
తుర్య అంగీరసః కల్పః శాంతి కల్పస్తు పంచమః
1.నక్షత్రకల్పము- (నక్షత్ర శాస్తమ్రు)
2.వైతాన కల్పము - (యజ్ఞానుష్టాన శాస్తమ్రు)
3.సంహితావిధి:(వేదభాగాలను ఆధ్యాత్మిక విద్యకై వినియోగించుకొనే శాస్తమ్రు)
4.అంగీరసకల్పము (్భతిక విజ్ఞానశాస్తమ్రు)
5.శాంతికల్పము- (శాంతి పౌష్టిక క్రతు విధాన శాస్తమ్రు)

కుప్పా వేంకట కృష్ణమూర్తి