Others

ప్రియమణి ఆశలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ ప్రియమణి ఒక్క గ్లామర్ కాదు.. నటనలోనూ తన సత్తాచాటి నటిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాల పాలవడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో టీవీ షోలకు జడ్జ్‌గా మారింది. అయితే తాజాగా ఓ కత్తిలాంటి అవకాశం రావడంతో ఈ అమ్మడు ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. పైగా ఆ పాత్రతో మళ్లీ హీరోయిన్‌గా తన క్రేజ్ పెరగడం ఖాయమనే ఆలోచనలో ఉంది. ఇంతకీ ప్రియమణిని అంతగా ఇంపాక్ట్‌చేసిన పాత్ర ఏమిటో తెలుసా.. ఆమధ్య తమిళంలో హీరో ధనుష్ నటించి సంచలన విజయం అందుకున్న కోడి సినిమా రీమేక్ కన్నడంలో చేసారు. తెలుగులో ధర్మయోగి పేరుతో విడుదలైంది. అందులో త్రిష చేసిన నెగిటివ్ పాత్రలో ప్రియమణి నటించింది. ఈ పాత్రతో తనకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్న ఈ అమ్మడు ఆ సినిమా విడుదలకోసం ఎదురుచూస్తుంది. రవి హీరోగా నటించిన ఈ చిత్రానికి కన్నడ సినిమాటోగ్రాఫర్ అశోక్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నాడు.