AADIVAVRAM - Others

అనుమతి (స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేపర్లోంచి తలెత్తి చూసిన తండ్రి చేతిలో నూనె పేకెట్లతో వచ్చిన కూతురు ఆమోద వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
‘ఇవెక్కడివి? వీటిని కొనడానికి నీకు డబ్బెక్కడిది?’
‘కొనలేదు నాన్నా. ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి’ ఆమోద సంతోషంగా చెప్పింది.
‘ఫ్రీగానా? ఎవరు ఇచ్చారు?’
‘చౌరస్తాలో ఓ వేన్ తిరగబడింది. అందులోంచి అట్టపెట్టెలన్నీ బయటకి పడిపోయి, వాటిలోంచి ఈ నూనె పేకెట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డు మీదంతా నూనె పేకెట్లే’
‘అరె! డ్రైవర్‌కి ఏమైనా అయిందా?’
‘కాలేదు. అంతా వీటిని ఏరుకుని తీసుకెళ్తూంటే మన కోసం నేను వీటిని తెచ్చాను’ ఆమోద గర్వంగా చెప్పింది.
‘మరి ఆ వేన్ డ్రైవర్ని ‘వీటిని తీసుకెళ్లచ్చా? అని అడిగావా?’ తండ్రి ప్రశ్నించాడు.
‘లేదు’
‘ఐతే నువ్వు చెప్పినట్లు ఈ నూనె పేకెట్లు ఫ్రీగా రాలేదు. వాటి యజమానుల అనుమతి లేకుండా దేన్నైనా తీసుకోవడం ఉచితంగా తీసుకోవడం కిందకి రాదు. దొంగతనం అవుతుంది’
వెంటనే ఆమోద మొహం పాలిపోయింది.
‘కాని దొంగతనం కాదు నాన్నా. అంతా తీసుకున్నారు. పెద్దవాళ్లు, ముసలివాళ్లు కూడా’
‘ఇదివరకు నీకు ఓ సందర్భంలో చెప్పాను. అంతా చేసినా సబబు కానిది ఏదీ సబబుగా మారదు. రేపు యమధర్మరాజు నీ పాప పుణ్యాలని విచారించేప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశాడన్నది పట్టించుకోడు. నువ్వు చేసింది ధర్మమా, కాదా అన్నదే చూస్తాడు’
ఆమోద కొన్ని క్షణాలు తన చేతుల్లోని నూనె పేకెట్ల వంక చూసి ఆలోచించి చెప్పింది.
‘ఐతే వీటిని వెనక్కి ఇచ్చేసి వస్తాను. కాని ఆ డ్రైవర్ అక్కడ లేకపోతే? నువ్వూరా నాన్నా. వాడిని ఎలా కనుక్కోవాలో నువ్వు సహాయం చేయగలవా?’

మల్లాది వెంకట కృష్ణమూర్తి