Others

బుద్ధుని బోధనలు ఆచరణీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవిభక్త కరీంనగర్ జిల్లా గతకీర్తికీ,ప్రాచీన చరిత్రకూ నిలువుటద్దంగా నిలిచియుంది. రాష్ట్ర పురావస్తుశాఖ రిటైర్డ్ డైరక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా ప్రాక్చచరిత్ర 50 వేల సంవత్సరాలకు పూర్వమున్నదని రుజువైతే, అది సామాన్యమైన విషయమేమీకాదు. గౌతమీనదీ దక్షిణ తీరమున పరివ్యాపితమైయున్న ఈజిల్లాలో, ఉత్తర దక్షిణ భారతీయులకు సేతువై నిలిచిన ఈప్రాంత నాగరికత కాల ప్రవాహంలో కొట్టుకొని పోయినా, ఔత్సాహికులైన చారిత్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా కథలుగా, గాధలుగా, నోళ్ళలో, రాళ్ళలో, ఆకులలో, రేకులలో, ఆక్కడక్కడా నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోనికి రాగలిగింది.
చరిత్రలో ఆంధ్రులకు లభించినంతవరకు, శాతవాహనులదే మొట్టమొదటి రాజవంశమని, అదీ మహారాష్టల్రోని పైఠానోలేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే పురాణాలలో పేర్కొనబడిన ఆంధ్ర భృత్యులని, తొలి ఆంధ్ర ప్రభువుల సేవకులనే విషయం కోటి లింగాల తవ్వకాలలో బయల్పడడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే శాతవాహనుల మూల పురుషులకు ఆవాసస్థానమని చారిత్రక పరిశోధనలు స్పష్టం చేశాయి. శ్రీముఖునికి చెందిన నాణాలను, ధర్మపురి వాస్తవ్యుడైన చారిత్రక పరిశోధకులు, కీ.శే.సంగనభట్ల నరహరిశర్మ కనుగొన్నాక శాతవాహన వంశానికి మూలపురుషుడనదగిన శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని రుజువైనాక, చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది.
క్రీ.పూ.శతాబ్దాల క్రితమే ఆంధ్ర రాజ్యం శాతవాహనుల ఏలుబడిలోవర్థిల్లగా, వారి అభిమాన పాత్రమైన బౌద్ధమతం, ఈప్రాంత ప్రజల ఆరాధ్యమతమై విరాజిల్లింది. ఇక్కడి ప్రాచీనమైన ప్రతి గ్రామం పేరులో, ప్రతి నిర్మాణ కౌశలంలో, ప్రతి కట్టడంలో, వస్తువుల్లో, మట్టిపాత్రల్లో, మతంతో పెన వేసుకున్న చరిత్ర పలుకుతుంది. శాతవాహన చక్రవర్తుల ఛత్రఛ్చాయల్లో బౌద్ధమతం విస్తరించి, శాంత్యహింసలు విశ్రమించిన ఈప్రాంతంలో, నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, త్రవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్టలేని వేలసంవత్సరాల చరిత్రకు వౌన సాక్షీభూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి క్షోభిస్తూ, అనాసక్తులైన అధికారుల, ప్రజాప్రతినిధుల అశ్రద్దకు, నిర్లక్ష్యానికి కృంగి కృషిస్తూ ఆయువుతీరకమునే్న అస్తమిస్తున్నాయి. నిన్నటివరకూ ఆలనా పాలనా కరువై ‘‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ దీనాతిదీనంగా విలపించిన ఇప్పటి వరకు ధర్మపురి,
ప్రస్తుతం వెల్గటూరు మండలంలోని పాషాయిగాం బౌద్ధస్థూపం, ఒక కంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా నేలమట్టమయింది. క్రీ.పూ.6వ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతాలలో బౌద్ధమత వ్యాప్తి జరిగినా అశోకుని కాలంకన్నా ముందే దక్కనులో ప్రవేశించిన బౌద్ధమతం శాతవాహనుల హయాంలో విశేషాదరణ పొందింది. నాడు కరీంనగర్ జిల్లాలో మూడు ప్రాచీన బౌద్ధ కేంద్రాలుండేవి. వాటిలోని ధర్మపురి మండలంలోని క్రీ.పూ.200 సంవత్సరకాల సంబంధిత పాషాయిగాం బౌద్ధస్థూపానికి విశేష ప్రాధాన్యత ఉండేది. దీనికి ఆరు వృత్తాకార పలకలండేవి. వీటిపై ఒకపద్మం, ఏనుగు బొమ్మలు, స్థూపానికిరువైపులా స్థంభాకృతులు కలిగియున్న ఆస్థూపం, క్రీ.శ.రెండవ శతాబ్దానికి చెందినదిగా, ధూళికట్ట స్థూపం కన్నా ప్రాచీనమైనదిగా, జిల్లాలోని మొట్టమొదటి రాతికట్టడంగా చరిత్రకారులు రుజువు చేశారు. క్రీ.పూ. 2వ శతాబ్దపు ‘‘నాగసింపీయకాయ, జమజో, రాగబ్రహ్మ లేఖలు’’ స్థూపంవద్ద లభ్యమైనాయి.

- సంగనభట్ల రామకిష్టయ్య...9440595494