మెయిన్ ఫీచర్

మీరు కాఫీ ప్రియులా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వకాలంలో దంతధావనం చేసి వేడి వేడి పాలు తాగేవారట. ఎండాకాలం వచ్చినపుడు చల్లని మజ్జిగ తాగేవారట. వారంతా ఆరోగ్యంగా ఉండేవారు. చిన్న పిల్లలకు సద్దిన్నాల పేరిట మీగడ పెరగన్నాలు పెట్టేవారట. పెద్దలంతా స్నానం సంధ్య, పూజాదికార్యాలు చేసుకొన్న తరువాత దేనినైనా తీసుకునేవారట.
కాని కలియుగం.. విదేశీ సంస్కృతి వాడవాడలా ఇల్లిల్లూ పాకిపోయింది. కాఫీ తాగని వాళ్లు లేనేలేరంటారు కొందరు... అట్లా మారిపోయిన కాలంలో కాఫీ మంచిది కాదు అనే శాస్తవ్రేత్తలున్నా.. కాఫీ ఇదిగో ఇందుకిందుకు మంచిది అంటున్నారు చూద్దామా..
* చాలాసేపు పని తరువాత తాగే కాఫీ అలసటను దూరం చేస్తుంది
* ఉదయం నిద్రమత్తును వదిలించడానికి కూడా కాఫీ పనికి వస్తుంది.
* ప్రమాదకర స్థాయి లో కొవ్వు నిల్వలున్నా ఈ వేడి వేడి కాఫీ కరిగిస్తుంది
*కాని కాఫీలో ఉండే మెగ్నిషియం, పొటాషియం అనే ఖనిజాలు ఇన్సులిన్ ప్రేరకాలుగా బ్లడ్‌షుగర్ స్థాయిని తగ్గిస్తాయి కనుక చక్కెర లేని కాఫీ అంటే బ్లాక్ కాఫీ షుగర్ వ్యాధిగ్రస్తులకు మందు లా పనిచేస్తుంది.
* క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
*కాఫీ తాగే అలవాటు గుండె జబ్బులను నియంత్రిస్తుంది
* వృద్ధుల్లో కనిపించే అల్జీమర్స్ అనే మరుపువ్యాధి ని నిరోధిస్తుంది.
కనుక ఏతావాతా కాఫీ ప్రియులందరూ ఈ ముక్కలు చెప్పుకుంటూ చప్పున కాఫీ తాగేయండి...

- మరువాడ భానుమూర్తి