Others

శ్రీనాథునికి సేమియా పాయసం తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనాథుని శృంగార నైషధ కావ్యాన్ని లోతుగా చదివితే కవిసార్వభౌమునికి సేమియా పాయసం రుచి తెలుసనేది మనకు తెలుస్తుంది. ఆధునిక వంటకంలా అనిపించే ‘సేమియా పాయసం’ ఎప్పుడో ఐదారు వందల ఏళ్ల నాటి శ్రీనాథ మహాకవికి తెలుసనే విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. నైషధ కావ్యంలో నలదమయంతుల వివాహానంతరం నలుడు తన మామగారయిన భీమమహారాజు గారి ఇంట ‘బువ్వపు బంతి’ని ఆరగించే సందర్భంలో నలుని బంధువులందరికీ రకరకములైన వంటకాలను వండి వడ్డించారని శ్రీనాథుడు అపూర్వంగా వర్ణించాడు. సేమియా ప్రస్తావన ఉన్న నైషధంలోని ఆ పద్యం ఇదే..
సీ॥ గోధూమ సేవికా గుచ్ఛంబు లల్లార్చి
ఖండ శర్కరలతో గలపి కలపి
గుజ్జుగా గాచిన గోక్షీర పూరంబు
జమిలి మండిగలపై జల్లి చల్లి
మిరియంబుతో గూడ మేళవించిన తేనె
దోరంపులడ్వాలు దోచి తోచి
పలుచగా వండిన వలిపెంపు జాపట్లు
పెసర పప్పులతోడ బెనచి పెనచి
తే.గీ॥ గోవ జవ్వాది కస్తూరి గొఱతపరచు
వెన్న పడిదంబు జొబ్బిల విద్రిచి విద్రిచి
వారయాత్రికులను మోదవంతులగుచు
వలచి భుజియించి రొగి వంటకములు
-శృంగార నైషధం (6-120)
ఈ పద్యంలో ‘గోధూమ సేవికా గుచ్ఛంబు’ అనడంలో ‘సేవిక’ అనే పదం ఆధునిక ‘సేమియా’కు సూచకం. ఈ పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ వేదం వెంకటరాయ శాస్ర్తీగారు ‘సేవికలు’ అనగా గోధుమ పిండితో నిడుపుగా, సన్నగా దీపపు వత్తుల వలె చేయబడు భక్ష్య విశేషము’ అని చెప్పారు. ఇంకా నలుని వివాహపు బువ్వపు బంతిలో ఆవుపాల కోవా అద్దబడిన పూరీలు, తేనె, మిరియాలు వేసిన లడ్డూలు, పెసరపప్పుతో చేసిన పలుచని, తెల్లని దోసెలు, ఘుమఘుమలాడే వెన్నడో చేసిన వంటకములు అతిథులకు వడ్డించబడినవట. ఇన్ని భక్ష్య విశేషాలను మూలంలో శ్రీహర్షుడు వర్ణించలేదు. వేడివేడిగా పొగలు గ్రక్కే తెల్లని సన్నబియ్యపు అన్నం, వెన్న కాచిన మంచి నెయ్యి, అమృతపు అడుసేమో అనే విధంగా ఉన్న చిక్కని గడ్డపెరుగు వంటి వాటిని విశేషంగా వర్ణించాడు.
ఇదంతా చూస్తుంటే మనకన్నా మన ముందు తరాల వాళ్లే ఎంతో మధురమైన పదార్థాలను వండుకుని తిన్నారనిపిస్తుంది. లడ్డూలలో మిరియాలు వేయడం వాతాన్ని హరించడానికేమో ననిపిస్తోంది. లేదా తీపి వెగటు పుట్టకుండా ఉండడానికి కూడా కావచ్చు.
ఇంతకీ ఆధునిక రూపమైన ‘సేమియా’ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ‘సేవికా’ ‘సేవియా’ ‘సేవె’ అనే పేర్లతో దర్శనమిస్తోంది. శ్రీనాథునికి మూడు నాలుగు దశాబ్దాల తరువాతి వాడైన పిల్లలమర్రి పినవీరభద్రుడు తన జైమినీ భారత కావ్యంలో-
సీ॥ తెగిన జందెములేల తెచ్చెదరనగావు
వినుడివి సన్న సేవియలుగాని (జై.్భ)
‘తెగిన జంధ్యాలనుకుంటున్నారేమో! వీటిని, ఇవి సన్న ‘సేవియలు’ అని చెప్పాడు.
సన్నగా ఉన్నాయని పినవీరభద్రుని భావం. ‘కవిరంజనము’ అనే కావ్యంలో అడిదము సూరకవి ‘ప్రేవుల ప్రోవులు సేవెలుగా..’ అని సేమియాలను ‘పేగుల ప్రోవుల’తో పోలుస్తూ కాస్తంత నాన్ వెజిటేరియన్ ఫక్కీలో వర్ణించాడు. ఇంకా పొనె్నగంటి తెలగన తన ‘యయాతి చరిత్ర’ కావ్యంలోనూ, ‘సేవెలు’ అనే పదం వాడాడు. అంటే శ్రీనాథుడి కాలానికే ‘సేమియా’కు ఇంత ప్రాచుర్యం ఉందన్నమాట.

--డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949