Others

‘చందురుడూ నిన్నుచూసి చేతులెత్తాడు..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పాటల సాహిత్యం ప్రకృతితో ముడిపడి మనసుకు హాయిగొలిపే మలయ సమీరంలా మధురాతి మధురంగా సాగిపోయేది. ఆ పాట ఏ నోట విన్నా అజరామరమై సంగీతం - సాహిత్య ప్రియులను సుమనోహరంగా అలరింప చేసేది!! అలా అందంగా ఆనందంగా అలవోకమైన సాహితీ వాహినిలా సాగిపోయిన ఈ పాట - ఇప్పటికీ - ఎప్పటికీ మనోల్లాసాన్ని కలిగించే మంచిపాట! కీ.శే. డా. సినారె శైలీ పరంపరకు, భావగర్భితమైన భావుకతకు ఇది ఒక ఉదాహరణ! పల్లవి నుంచి పాట ముగింపు వరకూ ఒకేరకమైన వరవడిలో వడి, వడిగా సాగిన ఈ యుగళగీతం - అప్పట్లో యువతను ఉర్రూతలూగించింది. స్వరబ్రహ్మ కీ.శే. కె.వి.మహదేవన్ గారి బాణీ ఎన్నిసార్లు విన్నా ఎల్లప్పుడూ చెవుల్లో ప్రతిధ్వనించే విధంగా ఉంటుంది. మాటల్నైనా పాటలుగా ప్రవహింపచేయగల ఘనుని చేతిలో పడిన ఈ గీత సాహిత్యం మరింత రాగమయి మనసును రంజింప చేసింది. కథానాయకుడిని కథానాయిక చందురునితో పోల్చడం ఒక చమక్కు అయితే కథానాయికను - కథానాయకుడు గోదారితో పోల్చి - ‘‘గోదారి నిన్ను చూసి గుసగుసలాడింది - తనవేగం నీలో చూసి తడబడిపోయింది - తబ్బిబ్బయ్యింది’’ మనసారా కొని యాడడం ఓ గమ్మత్తయిన మత్తు కలిగించే భావన! నేటికి 33 వసంతాలు నింపుకున్న ఈ తెలుగుపాట సంగీత - సాహిత్యపరంగా ఎప్పటికీ సజీవమే!’’ అలాగే ‘‘్భమలు మెచ్చిన రసికతలో - ప్రేమలు పంచిన చతురతలో’’ అనే అంత్యానుప్రాస నియమ పోలికతో కూడిన అక్షరాల అమరికిగా అలరారిన పదజాలం - దాని వెనుక నర్మగర్భంగా తొంగి చూసిన భావజాలం - అనితరసాధ్యం. తెలంగాణాలో పుట్టి పెరిగిన ‘సినారె’ తెలుగు సినీ కవి కావడం మన పూర్వజన్మ పుణ్యఫలం.

-మరువాడ భానుమూర్తి, వనస్థలిపురం, హైదరాబాద్