AADIVAVRAM - Others

స్పీడ్ బ్రేకర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో గుంతలు కన్పిస్తాయి. అదే విధంగా మరెన్నో స్పీడ్‌బ్రేకర్లు వుంటాయి. గుంతలు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు మన వాహనాన్ని మెల్లగా నడుపుతాం. కాస్త జాగ్రత్తగా ఉంటాం.
అంతేకానీ రోడ్డు బాగోలేదని మన ప్రయాణాన్ని వాయిదా వేసుకోం. మానెయ్యం. మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఈ సూక్ష్మమైన విషయాన్ని మన జీవితాలకి అన్వయించుకోవడంలో పొరపడతాం. సరిగ్గా అన్వయించుకోం.
మన జీవితంలో కూడా ఎన్నో అవాంతరాలు వస్తాయి. మన ప్రయాణం సుఖప్రదంగా సాగదు. అయినంత మాత్రాన నిరాశకు లోను కాకూడదు. ఆశాభంగానికి గురికాకూడదు.
జీవితంలో విజయం సాధించిన వ్యక్తులని చూసి మన జీవితం అలా ఎందుకు లేదు. మనకు విజయాలు ఎందుకు రావడం లేదని బాధపడుతూ ఉంటాం.
విజయుల జీవిత చరిత్రలను చూస్తే మనకు వాళ్లు పడ్డ కష్టాలు ఎన్నో కన్పిస్తాయి. మహాత్మాగాంధీ జీవిత చరిత్ర చూసినా, నెల్సన్ మండేలా జీవిత చరిత్ర చూసినా మనకు ఈ విషయాలు బోధపడుతాయి.
మన ప్రయాణంలో గుంతలు, స్పీడ్‌బ్రేకర్లు ఎదురైనప్పుడు మన గమ్యాన్ని వదులుకోకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తామో అదేవిధంగా జీవిత ప్రయాణం కొనసాగించాలి.
సుఖంగా, క్షేమంగా మన ప్రయాణం జరుగడానికి స్పీడ్‌బ్రేకర్లు అవసరమే. స్పీడ్‌బ్రేకర్లు లేకపోతే అందరూ వేగంగా వాహనాలని నడుపుతారు. ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మన జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు స్పీడ్ బ్రేకర్ల లాంటివని మనం భావిస్తే ఆందోళన తగ్గుతుంది. మన జీవన ప్రయాణం సుఖంగా జరుగడానికి అవకాశం చిక్కుతుంది.
చీకటి తరువాత వెలుగు, వేసవి తరువాత వర్షాకాలం లాగా ఇవి ఒకదాని తరువాత ఒకటి వస్తాయి.
ఎతె్తైన శిఖరంలో నుంచి చూస్తేనే లోయ అందాలు కన్పిస్తాయి.
అవాంతరాలు, అనుకోని సంఘటనలు జీవితంలోని స్పీడ్‌బ్రేకర్లని అనుకుంటే జీవన ప్రయాణం సుఖంగా జరుగడానికి అవకాశం ఏర్పడుతుంది.

వృథా...
======
ఓ పదిహేను సంవత్సరాల క్రితం ఓ సైకిల్‌ని కొన్నాను. పార్క్‌కి వెళ్లి నడవడం వీలుకావడం లేదని సైకిల్ కొన్నాను. కొద్దిరోజులు తొక్కాను. ఆ తరువాత మానేసాను. ఇంట్లో ఎవరూ కూడా దాన్ని వాడటం లేదు. అది నిరుపయోగంగా మారిపోయింది.
ఇది ఒక్క మా ఇంట్లోని పరిస్థితే కాదు. చాలామంది ఇళ్లల్లోని పరిస్థితి. వ్యాయామం కోసం తెచ్చిన సైకిళ్లు, ట్రెడ్‌మిల్లు, బెంచేస్, ఎక్సర్‌సైజ్ వస్తువులు నిరుయోగంగా ఉండిపోతున్నాయి.
వాటిని జాగ్రత్తగా వాడుకుంటే దాని యజమానుల ఆరోగ్యం బాగుపడుతుంది. వాటిని కొనేటప్పుడు మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ కాలక్రమంలో ఆ ఉద్దేశం దుమ్ముకొట్టుకొని పోతుంది. అవి నిరుపయోగంగా మారిపోతాయి.
ఎంత వృధా.
ఈ ప్రపంచంలో చాలా వస్తువులు ఈ విధంగా వృధాగా మారిపోతున్నాయి.
అవి ఎక్సర్‌సైజ్ వస్తువులే కానవసరం లేదు. కాగితాలు కావొచ్చు. కలాలు కావొచ్చు. సంగీత పరికరాలు కావొచ్చు. ఆట వస్తువులు కావొచ్చు. బ్యాడ్మింటన్ బ్యాట్ కావొచ్చు. వాలీబాల్ కావొచ్చు. ఫుట్‌బాల్ కావొచ్చు.
అవి ఏమైనా కావొచ్చు.
ఏమైనా వృథా కావడం ఎంత దురదృష్టకరం.
ఇవి వృథాఅయితే ఫర్వాలేదు.
మనుషుల్లో వున్న శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు వృధా కావడం దురదృష్టం మాత్రమే కాదు. నేరం కూడా.
మన శక్తిసామర్థ్యాలను బాగా ఉపయోగించుకుంటే అది మనకి మాత్రమే కాదు ఈ సృష్టికే మేలు చేస్తుంది.
ప్రతి వ్యక్తిలోనూ ఇతరుల్లో లేని శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు వుంటాయి.
వాటిని గ్రహించి, సరిగ్గా ఉపయోగించుకోవడం మొదలుపెడితే వృధా కాకుండా ఉంటుంది.
అడవిలో పూచిన అందమైన పుష్పం మాదిరిగా శక్తియుక్తులు కావడానికి వీల్లేదు.