Others

ఆర్మీ ఆఫీసర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయ్ టాక్.....
------------------------------

ఆర్మీ ఆఫీసర్‌గా..
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇప్పుడు యమబిజీగా ఉన్నాడు. ఏకంగా నాలుగు, ఐదు సినిమాల్లో నటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. వాటిలో ‘తోర్ఫాజ్’ అనే చిత్రం ఒకటి. మిగతా సినిమాల్లో ఎలా ఉన్నా ఈ సినిమాలో మాత్రం ఫిట్‌గా ఉన్న సంజయ్‌దత్‌ని చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. గిరీష్ మాలిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూసైడ్ బాంబర్ కిప్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగనుందట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇది కాకుండా ‘కళంక్’, ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’, ‘పానిపట్’లాంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో ‘కళంక్’, ‘పానిపట్’ వచ్చే ఏడాది విడుదలవుతాయి. ఇదిలా ఉంటే.. సంజయ్‌దత్ జీవితం ఆధారంగా రణ్‌బీర్ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన ‘సంజు’ చిత్రం వచ్చే నెల 20న విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

పెళ్లి ఇప్పుడే కాదంటూ..
బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోను క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ ప్రియాంకా చోప్రా రహస్యంగా పెళ్లిచేసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె విమానంలో ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటో పెద్ద దుమారమే రేపుతోంది. దానికి కారణం ఆమె చేతికి కొత్తగా ఏదో బ్రాస్‌లెట్ ఉండడమే. దాంతో ప్రియాంక వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక వెంటనే రెస్పాండ్ అయ్యింది. ఈ ఫొటోను చూసి అందరూ నేను రహస్యంగా వివాహం చేసుకున్నానని ప్రచారం చేస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. దిష్టి తగలకుండా ఆ బ్రాస్‌లెట్ వేసుకున్నానని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేసింది. అదీ విషయం!