Others

కర్ణుడిపై ఆశలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాల హీరోగా కమల్‌హాసన్ తరువాత అంతటి పేరు తెచ్చుకున్నాడు నటుడు విక్రమ్. జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ పలు భిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన కెరీర్‌లో ‘ఐ’ చిత్రం మైలురాయిగా నిలిచింది. కమర్షియల్‌గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినప్పటికీ నటుడిగా విక్రమ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ఐ’ చిత్రం తరువాత ఆయన వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మంచి సినిమాతో విజయాన్ని అందుకునే దిశగా ప్రయత్నాలు సాగించాడు. తాజాగా ‘మహావీర కర్ణ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్.ఎస్.విమల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ కర్ణుడి పాత్రలో కన్పించనున్నాడు. పురాణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో నాటి కర్ణుడు ఎలా వుంటాడో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అక్టోబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రాన్ని 2019 డిసెంబర్‌లో విడుదల చేస్తారట.