Others

వాహ్..అమలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాస్పద వార్తలతో ఎప్పుడూ వార్తల్లో వుంటూనే సంచలనం సృష్టించే కేరళ బ్యూటీ అమలాపాల్ ఎప్పటికప్పుడు తన రూటును మార్చుకుంటూనే వుంది. తాజాగా బాలీవుడ్‌పై కూడా దృష్టి సారించింది. ఇప్పుడు ఆసనాలతో మరో అడుగు ముందుకేసి అందరినోటా ‘వాహ్..అమలా’ అనిపించుకుంటోంది. ఆసనాల ద్వారా ఈ అమ్మడికి వస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. శీర్షాసనం చేయండి ఎంతో శక్తిని పొందండి అంటోంది. ఇన్ని చేస్తూ తన అందం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వివాహనంతరం కూడా నాజూగ్గా, సన్నగా ఉండడానికి వ్యాయామమే ప్రధాన కారణమని కూడా చెబుతోంది. యోగాసనాలకు ప్రాధ్యానతనిచ్చే ఈ బ్యూటీ తాజాగా తను శీర్షాసనం చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్‌జనుల్లో తీవ్ర హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయం గురించి అమలా మాట్లాడుతూ- ‘‘యోగాలో తలకిందులుగా నిలబడి శీర్షానం వేయడం చాలా కష్టం. అందరూ సులభంగా ఈ ఆసనాన్ని చేయలేరు. కఠిన శిక్షణ ద్వారా ఈ ఆసనం సాధ్యం. దీనిని వేయడానికి నేను చాలా కష్టపడ్డాను. దీనికోసం శిక్షకుడిని ఏర్పాటు చేసుకున్నాను. ఆరంభంలో గోడను ఆసరాగా చేసుకుని వేసేదాన్ని. ఫ్రీగా ఉన్నప్పుడు శిక్షణ పొందుతుంటాను. ప్రస్తుతం స్వయంగా తలకిందులుగా నిలిచి శీర్షానం చేయగలను. ఈ ఆసనం శరీరానికి శక్తినిస్తుంది’’అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రక్షకన్’ చిత్రంతో పాటు, తెలుగు, మలయాళం భాషలోనూ వివిధ చిత్రాల్లో నటిస్తోంది.