Others

వాడని చిరునవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఉషోదయంలో
బాలభానుడి ముఖబింబం
నీ నుదుట సింధూరమై
మెరిసిపోతోన్న సమయాన
రవివర్మ కుంచె దిద్దిన
అపురూప చిత్రానివై
నా హృదయ ఫలకంపై
స్థిరంగా నిలిచిపోయావు!
నిన్నటి వరకు నీతో పంచుకున్న
అనుభూతుల జ్ఞాపకాలను
నా హృదయ కుహరంలో
నిక్షిప్తం చేయడానికే
కవితలల్లడం నేర్చుకున్నాను!
పున్నమి జాబిలి వెనె్నల
నీలాకాశ నీలిసంద్రాన్ని
ఆహ్లాదంగా ఆక్రమించినట్లు..
నువ్వు నా పెదవులపై
ఏనాటికీ వాడని చిరునవ్వై
శాశ్వితంగా నిలిచిపోయావు!
నీ నవ్వు శరదృతువు వెనె్నల్లా
స్వచ్ఛంగా చల్లగా వుండి
చీకట్లు నిండిన నా మనసు పొరలను
తేజోవంతం చేసి నన్ను అలరించింది!
యుగాలెన్ని గడిచినా..
నీ చిరునవ్వుల కౌముదీ కాంతుల కోసం
నేను నిరీక్షిస్తూనే వుంటాను సుమా!
*

-విడదల సాంబశివరావు 98664 00059