Others
ఏటికో రోజు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 May 2018
- నారాయణమూర్తి తాతా, 9298004001

మొన్న
పిచ్చుకల్ని పైకెత్తేసినాం
రెక్కల టపటపలు తప్ప
ఒక్క పిచ్చుక ఎగిరిన జాడలే
ఏ ఆకాశహర్మ్యంలోను
కిచకిచల రావం వినపడలే
నిన్న
కోకిలలను గుంపులు
గుంపులుగా చేర్చినాం
గళం మీద గళమెత్తి పాడినా
వసంతం గొంతు విప్పలే
ఏ ఖాళీస్థలంలోను
ఒక్క మొక్కైనా మొలవలే
నేడు
నీటి కోసం బోర్లు దిగేసినం
బొట్టు బొట్టు దోసిట్లో
ఒడిసి పట్టేసినాం
ప్రక్కన టాప్ లేక
కారే మంచినీళ్లు కనపడలే
ఇప్పటికే
అక్కుళ్లదినం
కృష్ణ కాటుకల దినం జరిపేసినం
రేపు
బియ్యపు చెట్టు దినానికి
నాగలిని జత కలుపుతాం
ఏటికోరోజు
ఓ దినాన్ని అంగరంగ వైభవంగా
ఊరేగించి హమ్మయ్య
మళ్ళీ ఏటికే ఈ దినమంటూ
మురికిగాలే పీల్చుతాం