AADIVAVRAM - Others

పాంచభౌతిక ప్రయోగ ఆవిష్కరణే గిక ప్రజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్థిరబద్ధితోనే యోగనిష్ఠ సాధ్యం అని అంటుంది కదా భగవద్గీత. మరి స్థిరబుద్ధికి కావలసింది చిత్తవృత్తి నిరోధమే కదా?!’ చైతన్యది ఏదో చెప్పాలనే తాపత్రయం.
చైతన్య ప్రశ్న పూర్తి కాకుండానే ‘చిత్తవృత్తి నిరోధం అంటే నువ్వేమనుకుంటున్నావ్?’ నా పరిప్రశ్న.
‘ఆలోచనలను కట్టుదిట్టం చేయటం. అలా ఆలోచనలను కట్టడి చేస్తూ ఆలోచనారహిత స్థితికి చేరటానికి చేసే ప్రయత్నమే యోగసాధన. ఆ సాధనతో పరిపక్వ స్థితికి చేరటమే యోగం’ చైతన్య తాను అర్థం చేసుకున్నది మూడు వాక్యాల్లో నా ముందుంచాడు.
‘చిత్తవృత్తి నిరోధం అంటే మనో వ్యాపారాన్ని నియంత్రించటం అన్నది ఒక అర్థమైతే, అసలు ప్రపంచానికి ఆవల ఉన్న స్థితిని అందుకోవటం అన్నది అసలైన అర్థం. ఆవలి స్థితిని అందుకోవటం అంటే ప్రాపంచిక వ్యామోహానికి, భౌతిక భోగానికి అనురక్తులం కాకపోవటం. దైహికతలో కూరుకోకపోవటం.
ప్రపంచం అంటేనే బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, మోహాలు, భోగాలు, భ్రమలు, ఊహలు, ఊసులు, ఆశలు, అతిశయోక్తులు, అవాస్తవిక ప్రకోపాలు. వీటిల్లో తలమునకలు కాకుండా, అవసరమైనంత మేరకు వాటి ఆచరణలో భాగస్వామ్యం వహిస్తూ, ఈ ప్రపంచాన్ని, ఈ జీవితాన్ని వర్తమాన చిరునామాగానే పరిగణిస్తూ శాశ్వత చిరునామా అయిన ఆత్మ లోగిలికి చేరటానికి చేసే ప్రయత్నమే యోగ సాధన. ఆ సాధనలో పరిణమిస్తూ పోవటమే యోగస్థితుల్ని అందుకోవటం. ఇలా ప్రాపంచికతకు అవసరం మేరకు బాధ్యత వహిస్తూ కర్తవ్య ఆచరణలో అడుగులు వేయటమే మన ఈ వర్తమాన ఆవాసంలో చేయగలిగింది.
ఈ అంశాలను గుదిగుచ్చి ‘బాహ్య స్పర్షేష్వ సక్తాత్మా’ అని అంటుంది భగవద్గీత. అంటే ఆత్మను తాకని బాహ్యమైన భౌతిక భోగాలపై ఆసక్తిని పెంచుకుని ఉండకపోవటం. చివరికి చిత్తం సైతం దేహ సంబంధే. దేహానికి చెందిన ఇంద్రియాలను నియంత్రించినట్లే దేహంలోని మనోవ్యాపారాన్ని సైతం నిరోధించగలగాలి. దీనే్న చిత్తవృత్తి నిరోధం అంటాడు గీతాచార్యుడు.’
‘మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నా సామాన్య ప్రజానీకం యోగం అంటే ఇంకా తమకు అందుబాటులో లేని మార్గం అనే భావిస్తున్నారు కదా?’ చైతన్య.
‘అవును చైతన్యా! అందుబాటు అనేది మనం అడుగువేస్తేనే అందిపుచ్చుకోగలిగే సామీప్యతకు వస్తుంది. అంతెందుకు, గుడికి వెళ్తేనే కదా ఆ దేవతా విగ్రహమైనా కనిపించేది. ఇంట్లో అయినా ఆ పూజగది వరకు అడుగులేస్తేనే.. ఆ పూజాగదిలోకి అడుగుపడితేనే.. ఆ పటం వైపు చూపు నిగిడిస్తేనే. ఈ ప్రయత్నం జరగనిదే ఏ దర్శనమూ సాధ్యం కాదు.’
‘నీది భక్తి మార్గం కావచ్చు. నువ్వు శివుడికి భక్తుడవు కావచ్చు. లేదా విష్ణ్భుక్తుడవు కావచ్చు. ఇలా ఎవరినో ఒకరిని ఆశ్రయించటం, యాక్సప్ట్ చేయటం అంటే అది నీ విశ్వాస ప్రకటన అనే అర్థం. ఇలా బయటి వ్వవస్థను నువ్వు అంగీకరించ గలుగుతున్నప్పుడు నీలోనే ఉన్న ఆత్మవ్యవస్థను ఎందుకు ఆదరించలేక పోతున్నావు. భగవద్గీతా శ్లోకాలను ఎన్నివేల సార్లు వల్లించినా అయిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో చెప్పినట్లుగా ‘బ్రస్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం’ అన్నది అర్థం అయితే కదా భగవద్గీతా తత్వం అర్థం అయ్యేది!
ఆత్మ విదితం అయితేనే బ్రహ్మ నిర్వాణం సాధ్యం అని స్పష్టం. మనం భౌతికంగా భోగయోగులమైనంత కాలం మనలది భౌతిక నిర్యాణమే. దైహిక మరణమే. మనం ఆత్మవర్తులం అయితేనేం ఆ భౌతిక నిర్యాణం బ్రహ్మ నిర్వాణంగా పరిణమించేది.
‘యోంతస్సుఖోంతరా రామ స్త్థాంత ర్జ్యోతి రేవ యః
సయోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతోధి గచ్ఛతి’
అంటే, గికంగా వనకు కావలసింది ఆత్మ సుఖం, ఆత్మ విశ్రాంతి, ఆత్మ జ్ఞానం - అదే బ్రహ్మ భూత స్థితి. ఆ స్థితిలో పొందేదే బ్రహ్మ నిర్వాణం. అది మామూలు నేత్రాలకు దైహిక నిర్యాణమే, భౌతిక మరణమే అయినా గిక ప్రస్థానంలో అది తొలి గిక నిర్వాణ భామిక. భగవద్గీత చెప్పే గిక దర్శనం, గిక సవాధి ఇదే.
నువ్వు అనొచ్చు, ఆత్మ కనిపించటం లేదు కదా, కనిపించేదానే్న నమ్మబుద్ధేస్తుంది అని. మరి కనిపిస్తోంది అనుకుంటున్నది కూడా ఒక శిలనో, ఒక పటమో తప్ప మరేం కాదే! అయినా ఆ కనిపించే మూర్త రూపంలో కనిపించని శక్తిని చూసుకుంటున్నావ్ కదా! అలాగే నీలో కనిపించకుండా ఉన్న ఆత్మ వ్యవస్థను సైతం ఒక శక్తి వ్యవస్థగా, నీ జీవితానికి అస్తిత్వంగా ఎందుకు అంగీకరించలేక పోతున్నావ్?’
ఈ రోజు ప్రతి ఒక్కరికి కావలసింది ఆకర్షణ. ఎంజాయ్‌మెంట్. పరానికి సైతం షార్ట్‌కట్ మార్గం. టికెట్ కొనుక్కుని దర్శనం చేసుకునే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకున్నాక ఆ పరం సైతం అప్పనంగా దొరకాల్సిందే.

(మిగతా వచ్చే సంచికలో)

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946