Others

‘రేస్’కు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఎప్పటిలాగే తనకు ఎంతగానో కలిసి వచ్చిన రంజాన్ పండగకు మరో కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రేస్ 3’. ఈ చిత్రానికి సంబంధించిన లోగో, మోషన్ పోస్టర్‌ను సల్మాన్‌ఖాన్ సోషల్‌మీడియాలో ఇటీవల అభిమానులతో పంచుకున్నారు. ‘రంజాన్‌కు రేస్’ అంటూ టీట్ చేశారు. 13 సెకన్ల నిడివిగల ఈ మోషన్ పోస్టర్‌లో కేవలం లోగోను మాత్రమే పరిచయం చేశారు. ‘రేస్’ ఫ్రాంచైజీలో సల్మాన్‌ఖాన్ తొలిసారి నటిస్తున్నారు. ఇంతకు ముందు రెండు భాగాల్లోనూ సైఫ్ అలీఖాన్ నటించిన విషయం తెలిసిందే. సల్మాన్‌కు జోడీగా జాక్వెలైన్ ఫెర్నాండేజ్ నటిస్తోంది. ఇక ఇందులోని కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం జాక్వెలైన్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం గమనార్హం. గతంలో వీరిద్దరూ ‘కిక్’ చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. అనిల్‌కపూర్, బాబీడియోల్, డైజీషా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థాయ్‌లాండ్, అబుదాబీలోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రం ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంది. రంజాన్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

మహిగిల్ ఇలా అంటోంది..!
సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఈమధ్య ఒకరి తరువాత ఒకరుగా పలువురు హీరోయిన్స్ స్పందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం రేపిన ఈ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా వైరల్ అయింది. పలువురు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంగతి చెప్పడంతో పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మహిగిల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ కెరీర్ ప్రారంభంలో సినిమాలో అవకాశంకోసం ఓ దర్శకుడి దగ్గరికి వెళ్లినప్పుడు సల్వార్ కమీజ్ ధరించి నిండుగా వస్తే నీకు ఎవరు అవకాశాలు ఇస్తారని హేళనగా మాట్లాడారని చెప్పింది. అవకాశాలకోసం లైంగిక వేధింపులు తప్పలేదని- కానీ అలాంటి రొంపిలోకి దిగకుండా జాగ్రత్తగా ఉన్నానని, సమాజంలో కామ పిశాచులకు కొదవే లేదని మండిపడ్డారు. దేవ్‌డి సినిమాతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు.

ప్రేమంటే అదే..మరి!
బాలీవుడ్ బ్యూటీలు సోనమ్‌కపూర్, సోనాక్షిసిన్హా ఇద్దరూ సినిమా నేపథ్యం నుంచి వచ్చినవారే. వీరిద్దరి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణమే ఉంది కాదీ ఎలాంటి శతృత్వం లేదు. అయితే తాజాగా సోనాక్షికి సోనమ్ క్షమాపణ చెప్పాల్సి వచ్చిందట. ఆ మధ్య జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొంది అందాల సోనాక్షిసిన్హా. ఆ సందర్భంగా సోనమ్ గురించి చెప్పమని వ్యాఖ్యాత అడిగితే ‘ఒకానొక సమయంలో సోనమ్ నా పట్ల తన యాటిట్యూడ్ చూపించింది. కానీ అంత అవసరం లేదు’ అని వ్యాఖ్యానించింది సోనాక్షి. ఈ విషయం తెలిసి సోనమ్ స్పందిస్తూ - ‘నువ్వంటే నాకు ఎప్పుడూ అభిమానమే. నీ పట్ల నేను అలా ప్రవర్తించినట్లు నాకు ఏ మాత్రం గుర్తులేదు. నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి క్షమించు’అని ట్వీట్ చేసింది. దీనికి వెంటనే సోనాక్షి కూడా స్పందించి ‘అయ్యో.. సోనమ్ నువ్వు ఇవన్నీ పట్టించుకుంటున్నావా.. ఇలాంటి టీవీ షోల్లో మనం చెప్పేవన్నీ నిజాలేనా? ఏంటి? ఇలాంటి వాటిని నువ్వు ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవద్దు’’అని ట్వీట్ పోస్ట్ చేసింది సోనాక్షి. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమంటే అదే మరి!!
*