AADIVAVRAM - Others

నిర్వచించుకోవడం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగకపోతే మనల్ని మనం నిందించుకుంటాం. మనం వున్న పరిస్థితులని నిందిస్తాం. మనం వున్న పరిస్థితులని బట్టి మనని మనం నిర్వచించుకుంటాం. ఇది సరైనది కాదని అన్పిస్తుంది.
మన యోగ్యతని, తెలివితేటలని బయట వుండే పరిస్థితులకి అప్పచెప్పితే అది మనకు మనం తగ్గించుకుంటున్నట్టు అవుతుంది తప్ప మరోవిధంగా వుండదు.
పరిస్థితులను బట్టి మనని మనం నిర్వచించుకుంటే చాలా సాకులు దొరుకుతాయి. మనం వున్న బాధలో కొనసాగడానికి అవి ఉపయోగపడతాయి. మళ్లీ మనం అలాంటి తప్పిదాలనే చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అది మన పురోగతికి ఉపయోగపడదు.
మన తప్పిదాల వల్ల మన వైఫల్యాలవల్ల మనని మనం నిర్వచించుకోకూడదు. మన సమస్య వల్ల మనకు ఎదురైన అవాంతరాల వల్ల, మన కుటుంబ నేపథ్యం వల్ల కూడా మనని మనం నిర్వచించుకోకూడదు.
అందుకు బదులుగా మనం వున్న పరిస్థితిని మరోరకంగా చూడటం నేర్చుకోవాలి.
ఆశావహ దృక్పథాన్ని అలవరచుకోవాలి. కష్ట సమయాల్లో మనం ఎదుర్కొన్న పరిస్థితిని గమనించాలి. సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి.
మనకున్న వనరుల వైపు మన దృష్టిని కేంద్రీకరించాలి. మన కలలని సాఫల్యం చేసుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుందన్న విషయాల వైపు మన దృష్టిని కేంద్రీకరించాలి.
క్షమించడం అంత సులువు కాదు. మన పరిస్థితులకి కారణమైన వ్యక్తులని కూడా క్షమించే విధంగా మన మనస్సుని తయారుచేయాలి.
ఓ మహాత్ముడు చెప్పినట్టు జీవితంలో ఎదురయ్యే విషయాలు పదిశాతం అయితే- మిగిలిన 90 శాతం ఆ విషయాలకి, పరిస్థితులకి మనం స్పందించే తీరు ముఖ్యమైంది.
ఇది వాస్తవం.
దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనల్ని మనం పరిస్థితులను బట్టి నిర్వచించుకోవడం వుండదు.