AADIVAVRAM - Others

అలవాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను డిగ్రీ చదుతున్నపుడు ఇద్దరు వ్యక్తుల క్లాసులు ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఒకతను జువాలజీ చెప్పే నాంపల్లి మధుబాబు. రెండవ వ్యక్తి కెమిస్ట్రీ చెప్పే పాండురంగారావు. అలవోకగా క్లాసు చెప్పేవాళ్ళు. చేతిలో పుస్తకం వుండేది కాదు. నోట్స్ గానీ కాగితం కానీ ఏమీ వుండేది కాదు. నాకు ఆశ్చర్యాన్ని గొలిపేది. వీళ్ళు ఈ విధంగా ఎలా చెప్పేవారోనని చాలామందిమి అనుకునేవాళ్ళం. మనకు కూడా అలా వస్తే బాగుండునని కూడా అన్పించేది. మా కాలేజీలో అప్పుడు వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్ లెక్చరర్స్. రఫియా సుల్తానా అనే లెక్చరర్ కూడా బోటనీ ఆ విధంగానే చెప్పేవారు.
గతంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు లేవు. అన్ని వాళ్ళ జ్ఞాపకశక్తిమీద ఆధారపడి వుండేవి. కొంతమంది నోట్స్ దగ్గర పెట్టుకొని పాఠాలు చెప్తుంటారు. క్లాసుల్లో పాఠాలే కాదు, చాలా రంగాల్లో ఇలా విజయం సాధించిన వ్యక్తులు, మనసులని చూరగొన్న వ్యక్తులు కన్పిస్తూ వుంటారు.
సక్సెస్‌ఫుల్ వ్యక్తులని చూసినపుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తూ వుంటాం. వాళ్ళ అవకాశాల గురించి ఆలోచిస్తూ వుంటాం. ఆయా రంగాల్లో వాళ్ళు విజయం సాధించడానికి కారణం ఏమిటని మన దృష్టిని కేంద్రీకరిస్తూ వుంటాం. వాళ్ళ మాదిరిగా విజయం సాధించాలంటే ఏమి చెయ్యాలని ఆలోచిస్తూ వుంటాం.
ఈ ప్రశ్నకి చాలామంది ఇచ్చే సమాధానం- అదృష్టం, అవకాశాలు, పరిశ్రమ. ఇట్లా ఏవో ఏవో చెబుతుంటారు. అదృష్టం ఒక్క శాతం మాత్రమే, అవకాశాలు రెండు శాతం. పరిశ్రమ మిగతా స్థానాన్ని ఆక్రమిస్తుంది.
కఠోర పరిశ్రమని నిర్దేశించేది ఏమిటి? దీన్ని నిర్దేశించేది మన అలవాట్లు.
మనం ఏది సాధించాలన్నా మన అలవాట్లు ముఖ్యం. మంచి అలవాట్లు, క్రమశిక్షణ మన మార్గాన్ని నిర్దేశించాయి, నిర్దేశిస్తాయి. మన అలవాట్లు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి.
ఇదివరకు చెప్పిన పాఠం అయినా ఉదయం లేచి చదువుకొని క్లాసుకి వచ్చేవాళ్ళు మా లెక్చరర్లు. అందువల్ల వాళ్ల క్లాసులు ఆసక్తికరంగా వుండేవి. నోట్స్ చూడకుండా వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు.
జ్యుడీషియల్ అకాడమీ ఫాకల్టీలో చేరిన తరువాత ఇదే పరిస్థితి నాకు అనుభవంలోకి వచ్చింది. గతంలో పదిసార్లు చెప్పిన క్లాసు అయినా మళ్లీ ఉదయం లేచి చదువుకోవాల్సిందే. అలా చదివనపుడు క్లాసు అంత ఆసక్తికరంగా వుండకపోయేది.
మన గమ్యాన్ని నిర్దేశించేవి మన అలవాట్లే. ప్రతి రంగంలోనూ ఇదే పరిస్థితి!