Others

వాకింగ్‌లో కబుర్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడన్నీ అపాఠ్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లే. కాని, నడక ప్రాముఖ్యం అందరికీ తెలుసు. దాంతో అపార్ట్‌మెంట్లల్లోని కింద ఉన్న ఖాళీ జాగాలోనో, లేక వాకింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయంచిన స్థలంలోనో మహిళలు, పురుషులు వాకింగ్ చేస్తున్నారు. అదిగో అలాంటి వాకింగే ఇది.
ఆ కనిపించే ఫ్లాట్స్ చుట్టూరా ఉన్న స్థలంలో వాకింగ్ చేయడానికి మహిళలూ పురుషులూ దాదాపు 45 దాటినవారు మెల్లిగా రాసాగారు. ఒకళ్ళకు ఒకళ్ళు హలో చెప్పుకుని ఇద్దరు ముగ్గురు కలిసి గ్రూప్‌లు గ్రూప్‌లుగా నడవసాగారు. ఇవ్వాళ ఫలానా ఆవిడ రాలేదే అంటూ ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించుకున్నారు. పలుకరింపులు అయ్య వాకింగ్‌మొదలెట్టారు. అంతేనా చూడండిఅటు టాకింగ్ కూడా
‘‘ఏమండీ మీరు ఈరోజు ఆవకాయ పెడ్తానన్నారు కదా... పెట్టారా? అని’’ ఒక పిన్నిగారు
‘‘లేదండీ ఈరోజు కుదరలేదు. అనుకోకుండా చుట్టాలొచ్చారు. అందుకే రేపటికి పోస్ట్‌పోన్ చేసాము’’అని ఒకరి సమాధానం.
‘‘అవునండీ నేను కూడ ఊరగాయలు పెట్టాలి. అవునూ బెల్లం మాగాయ ఎలా పెడ్తారండీ?’’అని ఇంకొకఠిఎన్ క్వైరీ...
‘‘అది అట్లా నడుస్తూ చెప్పేదికాదు. రేపు మా ఇంటికి రండి రెసిపీ ఇస్తాను’’ సమాధానం....! ‘‘అన్నట్లు మన వసంతగారు ఏవో తీర్థయాత్రలు చేయడానికి వెళ్తానన్నారు కదా వెళ్ళారా?’’ అని వనితామణి ఆరా......
‘‘ఆఁ వెళ్ళారు. నిజంగా వసంతగారు లక్కీ. హాయిగా యంగ్‌గా ఉన్నప్పుడే అన్ని ప్లేసెస్ చూసేస్తున్నారు. మాకెప్పుడు వస్తుందో ఆ అవకాశం’’ అని ఒకరి నిట్టూర్పు.....
***
ఇదండీ వరుస.... ....
చాలామంది ఇట్లాంటి వారే ఉంటున్నారీ మధ్య. వీరు చేసేది వాకింగ్ అందామా టాకింగ్ అందామా?
తమాషా ఏంటంటే ఈ వాకింగ్ చేసే మహిళలు మాట్లాడుకోని టాపిక్కే ఉండదు. ఒకళ్ళ గురించి మరొకరు విమర్శించుకోవడం దగ్గరనుంచీ ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలు మరియు విడ్డూరాల వరకూ వీళ్ళు చర్చిస్తూనే ఉంటారు.
మాటల్లోపడి వీళ్ళ నడక నత్తనడక అయిపోయిందన్న విషయం కూడ గమనించరు.
కాని, వాకింగ్ చేస్తూ మాట్లాడకూడదు. ఇట్లా నడిచేటపుడు మాట్లాడడం వల్ల నడక సఠిగా ఉండదు. పైగా గాలి ఎక్కువ పీల్చి ఆయాసం వస్తుంది. దీనికి బదులు చక్కగా ఎవరికివారు విడివిడిగా దైవధ్యానం చేసుకుంటూ వాకింగ్‌చేస్తే అటు పుణ్యం ఇటు వాకింగ్ వల్ల వచ్చే లాభాలు వస్తాయ. అది కాక వీళ్లు చెప్పుకునే గాసిప్స్ వల్ల ఏంలాభం ఉండదు. పైగా ఒకరు ఇంకొకరిని చాటుగా విమర్శించడం, ఆఁ ఆవిడ ఏంటో పెద్ద గొప్ప, ఆవిడకి మనుషులంటే పడదు. ఎవరితోనూ కలవదు అంటూ విమర్శలు గుప్పించడం! ఇట్లాంటివన్నీ స్నేహానికి చేటు తెస్తాయ. ఫ్రెండ్ షిప్‌ను పాడుచేస్తాయ. కనుక వాకింగ్‌లో నో టాకింగ్ ఫ్రెండ్స్

- కరుణ