Others

ఇలా చేద్దాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా చేద్దాం...
=========
* మెత్తగా అయపోయన టమాటాలను, మామిడి కాయలను ఇత్తడి గినె్నలు తోముకోవడానికి ఉపయోగిస్తే తళతళలాడుతాయ.
* రాగిపిండికి కాస్త అన్నం చేర్చి సంకటి చేస్తే శరీరంలో వేడిమి తగ్గుతుంది.
* ఆలును ఉడికించి వాటికి ఉప్పు, అల్లం వెల్లులి, పచ్చిమిరప చేర్చి ఉండలు చేసుకొని గుంటపొంగనాల్లో వేయంచుకుంటే అన్నంలోకి ఆదరువుగా బాగుంటాయ.
* రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండిని కాస్త చల్లని నీటిలో కలిపి తిరిగి దీనిని మరుగుతున్న నీటిలో వేసి కాసేపు ఉడికించిన తర్వాత సూప్‌గా తీసుకోవచ్చు.

చిట్కాలు:
======
* పకోడీలు కరకరలాడాలంటే కాస్త బియ్యపు పిండితో పాటు ఓ గరిటె వేడినూనెను చేర్చాలి.
* అన్నం వండేటపుడు మెత్తబడకుండా ఉండడానికి ఓ చెంచా నూనెను చేర్చితే సరి.
* మిగిలిన అన్నానికి పచ్చిమిర్చి, ఉప్పు జోడించి చిన్న చిన్న ముద్దలుగా ఎండబెట్టి నూనెలో వేయించితే అవి కర కరలాడుతూ రుచిగా ఉంటాయి.
*చిక్కుడు కాయలను నీటిలో ఉప్పు వేసి ఓ పొంగు రానిచ్చేదాక మరిగించి వాటిని వడకట్టి ఎండబెట్టుకొంటే చిక్కుడు వరుగులా ఉపయోగపడుతాయి.
* ఆలుగడ్డలను వేడినీటిలో వేసి ఒకసారి పొంగు వచ్చిన తరువాత ఎండ బెట్టుకుని కావాల్సినపుడు నూనెలో వేయంచుకుంటే చిప్స్‌లా కరకరలాడుతాయ. అన్నంతో ఆదరువుగా పనికివస్తాయ.

--ఆర్ సుశీల