Others

సర్వం శక్తిమయం జగత్ -1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యాన్ని తెలుసుకోవాలనే కాంక్ష మానవునికి ఈ నాటిది కాదు. ఇది అనాది. అంతం లేనిది. కొనసాగుతూనే వుంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలలో, వెదికే మార్గాలలో, చేసే పరిశోధనలలో, విధానాలలోనే భేదమంతా! మార్గాలు వేరైనా సత్యమొక్కటే. బహు విస్తారంగా వ్యాప్తి చెందుతున్న విజ్ఞానశాస్త్ర పరిశోధన, సనాతన వేద ప్రతిపాదిత సత్యానికి (అంటే ‘‘ఏకం సత్ విప్రాబహుదావదంతి’’‘‘ఏకమేవా అద్వితీయం బ్రహ్మ’’) దగ్గరగా జరగడం గమనించవచ్చు.
నేటి శాస్తజ్ఞ్రులు సత్యానే్వషణలో తనను వదిలి చుట్టూ వున్న పదార్థ శోధనలో మునిగి తేలుతున్నాడు. సత్యమెన్నటికి దూరంగానే వుంటుందో సనాతన మహర్షులు భౌతికతతోపాటు సత్యానే్వషణలో తమ అంతఃకరణలోలోతులకు తవ్వుకుంటూ వెళ్ళారు. అందువల్ల శాశ్వత సత్యాన్ని తెలుసుకోగలిగారు. పర్యావరణంతో సహా సర్వహిత ప్రద జీవనాన్ని పొందారు. భవిష్యత్తరాలకు విశ్వహిత జీవనాన్నందించారు. కొంతకాలం క్రితంవరకు విజ్ఞానం వేరు(సైన్సు) వేదాంతం వేరు అనే భావన ప్రబలంగా వుండేది శాస్తవ్రేత్తల్లో. ఈనాటికి కూడా చాలామందిలో అదే భావన వున్నది. వారి ఆలోచనలు కేవలం నిరాధారమనడానికి వీలులేదు. వేదాంత భావన అంటే ఉపనిషత్తులు మొదలైన వేదాంత గ్రంథాలన్నీచెప్పేదేమంటే మనకు కనిపించే విశ్వమంతా ఒకే ఒక మూల పదార్థం నుండి ఏర్పడింది లేక ఉద్భవించిందని. ఇది భారతీయ వేదాంత భావన. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలి. ‘ముండకోపనిషత్తు’లో శౌనకుడనే శిష్యుడు గురువైన అంగిరస మహర్షినీవిధంగా ప్రార్ధిస్తాడు.
శ్లో॥ ‘‘శౌనకోహవైమహాశాలో అంగిరసః
విధివదుప్రస న్నః పప్రచ్ఛ
కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం
విజ్ఞాతం భవతీతి॥ (3)
అర్ధం: హే భగవాన్ అంగిరస మహర్షీ ఏ విషయాన్ని తెలుసుకోవడంవల్ల సర్వాన్నీ (ప్రపంచమంతటిని) తెలుసుకొనవచ్చో దానిని తెలియచేయండి అని ప్రశ్నించాడు శౌనక మహర్షి. దీనికి సమాధానంగా గురువైన అంగీస మహర్షి యిలా చెప్పారు.
శ్లో॥ ‘‘దివ్యోహ్యమూర్తః పురుషః సబాహ్యాభ్యాం తరోహ్యజః
అప్రాణోహ్యమనాః శుభ్రోహ్యక్షరాత్వరతః పరః
(2-24)
శ్లో॥ ఏ తస్మాజ్జాయతే ప్రాణోమనః సర్వేంద్రియాణి చ
ఖం, వాయు, ర్జ్యోతి, రాపః పృథివీ, విశ్వస్యధారణీ (3-25)
అర్ధం: ఓశౌనకా! స్వయంప్రకాశమై ఆకారం లేనిది. అనాదినుంచి ఉన్నది. సర్వత్రా వ్యాపించినది అయిన ఆ పరబ్రహ్మతత్త్వం జీవుడి లోపలా బయటా ఉన్నది. ఆ పరబ్రహ్మతత్త్వం అవ్యక్తంగా రుూ జగత్కారణ రూపానికి అతీతమై యున్నది....
ఈ భూమితో సహా పంచభూతాలు, సమస్త విశ్వం, తత్త్వాలు, మనస్సు, ప్రాణము, హృదయ కుహరంలో ప్రకాశించే భావనా ప్రపంచం, సమస్త యింద్రియాలు, అన్నీ పరస్పరం పెనవేసుకుని వున్నప్పటికి, ఇవన్నీ ఒకే తత్త్వం నుండి ఆవిర్భవించినవే. ఆ తత్త్వం పేరే ‘‘ఆత్మ’’లేక పరబ్రహ్మ’’ అని చెప్పాడు.ఏ ప్రమాణం చేతను తెలిసికొనలేని తత్త్వమది. దానినే ఆదిశక్తి అన్నారు. ఈ శక్తి సర్వత్రా వ్యాపించి వుంది. పంచభూతముల యందు ఆయా శక్తులుగా వ్యాపించి వున్నది. అందుకే సర్వం శక్తిమయం జగత్ అన్నారు. ఇట్టి పరబ్రహ్మశక్తియే సగుణ నిర్గుణ రూపంగా చెప్పబడింది.
ఇదే భారతీయ ఉపనిషత్తులు బోధించింది. భిన్నత్వంలో అంతర్లీనంగా వున్నఏకత్వం ఏకత్వం లోంచి బహుత్వం. ...............ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590