Others

రాతలు మారాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మో అమ్మాయిలా ... నోరు తెరిచాడు అజిత్
ఎందుకురా.. అంతలా నోరు తెరిచావు. పెళ్లి సంబంధాలు వెతికాలి అంటే నీకు అమ్మాయిల్ని కాక ఇంకెవర్ని వెతకమంటావు? కోపంగా అడిగింది రత్న.
‘అది కాదమ్మా నీవు సీరియల్స్ రోజూ టీవీలో చూస్తున్నావు కదా. అత్తకోడళ్లు .. ఒకర్ని మించి మరొకరు ప్లాన్స్ వేస్తూ ఒకరిని మరొకరు శత్రువుల్లా చూసుకుంటున్నారు.... ఇంకోపక్క కూతురి కోసం ఎంతమంది ఆడపిల్లలనైనా చావమోది , బ్లాక్‌మెయిల్ చేసి తన కూతురి క్షేమం కోసం అల్లాడే తల్లిదండ్రులు.. మరో ప్రక్క పెళ్లైన హీరో కోసం ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పోటీ పడడం.. ’ వీళ్లంతా ఆడవాళ్లే.. నేటి ఆడజనం... అమ్మో నాకు పెళ్లి వద్దూ పెటాకులూ వద్దు... హతాశురాలైంది కొడుకు నోటి నుంచి వచ్చిన ఈ మాటలు విని రత్న.
నిజమే. నేట సీరియల్స్‌లో ఎక్కడ చూసినా అతి మంచితనం.. ఎదుటివాళ్లు ఎంత మోసం చేసినా, ఎంత దగా చేసినా వీళ్లు మాత్రం సర్దుకుపోతుంటారు. ఇంకా చూడాలంటే వీరి ప్రాణాలు కూడా తీసేస్తారు. ఆ విషయం వీరికి తెలిసినా వీరు మంచివాళ్లు కనుక నోరుమూసుకుని చావుకు సిద్ధవౌతారు.
తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని వీరికి తెలియదా. పిల్లి కూడా తన్ను అదే పనిగా కొడితే తిరిగి పైకి లేస్తుంది కదా. మరి మంచితనం ఉండాలి కాని అతిగా ఎందుకు? అది కూడా తప్పే కదా. ఎవరి కోసం త్యాగం చేయడం తనప్రాణాన్ని కూడా త్యాగం చేస్తే చివరకు మరొకరి సాయం చేయడానికి నీ ప్రాణం నీ దగ్గర ఉండదు కదా. మరి ఎందుకు వ్యర్థ ప్రయాసలు. ఒకరు బాగుండాలని కోరుకోవాలి. కాని వారే ఎదుటివారిని నాశనం చేయాలని చూస్తున్నపుడు వారికి బుద్ధి చెప్పడమో లేక వారి బారి నుంచి తప్పించుకోవడమో చేయాలి కాని కత్తి తెచ్చాడు కదా అని మెడ వంచకూడదు. ఇదీ తప్పే.
నేటి సీరియల్స్ అన్నీ ఇట్లానే ఉంటున్నాయి. ఇక మీద నైనా ముఖ్యంగా టీవీ సీరియల్స్ వ్రాసే రచయితలు లేక సీరియల్‌ను నిర్మించేవారైనా కాస్త మంచితనం మోతాదు తగ్గించండి... ముల్లునుముల్లుతో తీయకపోయినా ఆ ముల్లు గుచ్చుకోవడానికి శరీరాన్ని అనువుగా చేయనక్కర్లేదు అని తెలియ జేస్తే చాలు

- జి.కళ్యాణి