Others

ఫలభరిత జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుని మాటలను సంతోషంగా ధ్యానించినట్లయితే మన హృదయ వాంఛ తీరుతుంది. బైబిల్ గ్రంథాన్ని ఆనందంతో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును.
కీర్తన 1:1,2 ‘దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్తమ్రు నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు.’ మన దృష్టి, ధ్యాస అంతా ఎప్పుడూ ఈ లోక విషయాల మీదనే ఉంటుంది. చదువు, ఉద్యోగం, పెళ్లి, ఇల్లు, కారు, షికారు లాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూంటాం. అనేకసార్లు ఈ లోక విచారములోనే మునిగిపోతాం. ఇక మన జీవితానికి అర్థమే లేదన్నట్టుగా జీవిస్తాం. దిగులు, విచారముతో కృంగిపోతూంటాం. ఈ జీవిత పోరాటంలో ఐహిక విచారములతో కప్పబడి ఏదో ఒక ముసుగు వేసినట్టు, ముసురు పట్టినట్టు ఉండటం వల్ల దేవాది దేవుడు, సృష్టికర్త, మన తండ్రి ఉన్నాడు, ఆయన అన్ని పరిస్థితులను చక్కపెట్టగలడు అన్న విషయాన్ని మరచిపోతాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన కళ్లకు గంతలు కట్టినట్లుండి, దేవుని శక్తిని మరచిపోతున్నాం. సాతానుడు మన సమస్యలను పెంచి, శోధనలను పెంచి వాటినే ధ్యానించేటట్లు చేస్తాడు. మన ధ్యానమంతా డబ్బు సమస్య మీదనో, ఆరోగ్య సమస్యల మీదనో, ఆస్తుల మీదనో ఇంకా పనికిరాని విషయాలు ఎనె్నన్నో... వాటినే ధ్యానిస్తూ జీవితమంతా వృధా చేసుకుంటున్నాం. అయితే వీటన్నిటిని వదలి దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించినట్లయితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటామని బైబిల్ తెలియజేస్తోంది. రాజుల రాజు ప్రభువుల ప్రభువును సర్వాధికారి సర్వసృష్టికర్తయైన క్రీస్తు వైపు మన ధ్యానం ఉంచినట్లయితే ఈ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మనలను ఎంతగానో ప్రేమించి ఈ విశ్వమంతటినీ మనకొరకై సృజించి దాని మీద పూర్తి అధికారమిచ్చి, మన పతన స్థితిలో తన ఏకైక కుమారుని ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుని వైపు చూద్దాం. ఆయన చేసిన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను -శూన్యములో భూమిని వ్రేలాడదీసిన ఆయన శక్తిని, మాటతో సమస్తాన్ని కలుగజేసిన ఆయన దివ్య మహిమను, బండ నుండి నీటిని రప్పించిన విధానాన్ని, సముద్రాన్ని పాయలుగా చేసి ఎండిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించిన విధానాన్ని, నీటిని రాశిగా నిలిపిన విధం, మేఘములో నీటిని దాచిన విధానాన్ని, గొర్రెల కాపరిని రాజుగా చేసిన విధం, నూరేళ్ల వయసులో అబ్రహాముకు సంతానమిచ్చిన విధం, ఏలియా ప్రార్థన విని మూడున్నర సంవత్సరములు వర్షము ఆపిన విధము, తిరిగి ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షించిన విధము, దానియేలును సింహపు గుహలో నుండి కాపాడిన విధానాన్ని, ఆకాశం నుండి మన్నాను కురిపించి ప్రజల ఆకలి తీర్చిన విధం, ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు జల ప్రళయంతో వారిని లయ పరిచిన విధానాన్ని, సొదొమ గొమొర్రా నగరాలను అగ్నితో కాల్చిన విధానాన్ని.. ఇంకా మనకు తెలిసిన అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు అన్నింటినీ ధ్యానిస్తూ ఉండాలి.
ఫలించాలన్న ఆశ అందరికీ ఉంటుంది. దానికి బైబిల్ ఇచ్చిన సూత్రం దేవుని వాక్య ధ్యానమే. ఈ ధ్యానానికి డబ్బు అవసరం లేదు. ప్రత్యేక సమయం గానీ, స్థలం గానీ అవసరం లేదు. మనం ఉన్న చోటనే ధ్యానిస్తూ ఉండవచ్చు. అన్ని వేళల్లోనూ ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మనలో నుండి భయం వెళ్లిపోతుంది. ధైర్యం వస్తుంది. సమాధానంగా ఉంటాము. ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాము.
దేవుని నమ్ముకొని ధ్యానిస్తూ ఉండేవారు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె ఉందురు. వర్షము లేని సంవత్సరమున చింత నొందరు. కాపు మానదు. ఇటువంటి ఫల భరితమైన జీవితం మనమందరం కలిగి ఉండాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256