Others

అమ్మ భయపడుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి చెడుల తేడాను
తన బిడ్డలకు తెలిపేందుకు
అమ్మ తటపటాయిస్తోంది

ఓటమి గెలుపులనేవి
సహజ నియమాలని
సర్ది చెప్పటానికి
ఆమె సంశయిస్తోంది

స్నేహానికి, స్వార్థానికి
మధ్య ఉన్న భేదాన్ని
వివరించటానికి ఆమె
వెనుకడుగు వేస్తోంది.

వయసు ఉప్పెన లాంటిదని
నిలువెల్లా ముంచేస్తుందని
చెప్పటానికి ఆమె యోచిస్తోంది.

జీవిత అనుభవసారంతో
ఏ విషయం చెప్పాలనుకున్నా
నీకేమి తెలియదు అంటారని
ఆమె ఆలోచిస్తోంది
చెప్పిన విషయం వినకపోగా
కసురుకుంటారో, విసుక్కుంటారో
అని మదనపడుతోంది

తప్పు ఏదో ఒప్పు ఏదో
చెప్పేందుకు తన పిల్లలకు
ఇప్పుడు అమ్మ భయపడుతోంది.
*

-షేక్ నసీమా బేగం