Others

అమ్మ ప్రేమ నీడలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనురెప్పలు కాపలా
కనుపాప సేదతీరాలని!

చింతలేని నిద్ర
ఆ బాల గోపాలునిది!

అమ్మ అరచేతులుండ
నిదురించడానికెందుకు బెంగ!

పూలపాన్పులేలా..
అమ్మ ఒడి పడకుందిగా!

ఏ చీకూచింతా లేకుండా నిదురపో..
అమ్మ ప్రేమ నీడలో!
కమ్మని కలలే కను
అమ్మ జోలపాటలో!
హాయిగా ఆదమరచి నిదురపో
అమ్మ రక్షణ సన్నిధిలో!
*

--కుంచె చింతా లక్ష్మీనారాయణ 9908830477