Others

తల్లి మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవులన్నింటిలో
ఒకే విధంగా ఉంటుంది
జన్మనిచ్చిన తల్లిప్రేమ!

కన్న ప్రేగుకు కష్టమొస్తే..
కంటతడి పెడుతుంది!
తట్టుకోలేదు..
కన్న తల్లి మనసు!

పశుపక్షాదులలో నైన
పరమాత్మలో నైన
పరాన్న జీవులలో నైన
ఆత్మఒక్కటే..
ఆ పరమాత్మ ఒక్కడే!
ఆత్మ ఉన్నంత వరకు
కన్నబిడ్డపై
ప్రేమ కరిగిపోదూ..
తరిగిపోదూ..!
కొన ఊపిరితో కూడా..
కొట్టుమిట్టాడుతుంది
కన్నతల్లి మనసు

కన్నవారు కలకాలం
సల్లగుండాలని..
కోరుకుంటూ జీవిస్తుంది!

-ఉషశ్రీ తాల్క