Others

నాగపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహన నమస్త్భ్యుం పక్షిరాజాయతే నమః
అని శ్రావణ పంచమనినాడు నాగులను పూజించిన వారికి పుత్రప్రాప్తి కలుగుతుంది. సంతాన ప్రదులైన నాగులను పుట్టలో పాలు పోసి పూజిస్తే వంశోన్నతి జరుగుతుందని నాగభక్తుల నమ్మకం. కార్తికంలోను, మార్గశిరంలోను కూడా నాగులను పూజిస్తుంటారు.
ఈ నాగారాధన అనాదిగా వస్తున్నదే. నాగులను పూజించడం ప్రపంచమంతటా ఉంది. శ్రావణ, కార్తికాల్లో విశేషంగా నాగారాధన తెలుగునాట కనిపిస్తుంది. భవిష్యత్ పురాణంలో నాగపంచమి గురించిన ప్రస్తావన ఉంది.
రాక్షససంహారం చేయడానికి శివకుమారుడు ఉద్భవించాలని దేవతలు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. కుమారోదయంలో కాలయాపన జరిగింది. ఆ కాలవిలంబనాన్ని భరించలేని దేవతలు పరమేశ్వరుని శివకుమారుని ప్రసాదించమని పదేపదే వేడుకున్నారు. తమ ఏకాంతవాసానికి భంగం కలిగిస్తున్నారన్న కోపంలో పరమేశ్వరి దేవతలను అపుత్రులుగా శపించింది. ఆ తరువాత శివరేతస్సును అగ్ని, గంగాదేవి ధరించారు. గంగామాత కూడా శివరేతసును ధరించలేక రెల్లువనంలో గంగాదేవి విడిచింది. ఆ రెల్లు వనమంతా శే్వతవర్ణంలో మారింది. అక్కడే శివకుమారుని జననం జరిగింది. పుట్టినవెంటనే పాలకై ఏడ్చే శిశువును కృత్తికలు చూచి స్తన్యమిచ్చారు. కృత్తికలు స్తన్యమిచ్చిన కారణంగా కుమారునికి కార్తికేయుడన్న నామం స్థిరప డింది. ఆ తరువాత స్కంధునిగా, సుబ్రహ్మణ్యునిగా శివకుమారునికి పలునామాలు ప్రసిదిధమయనాయ. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుఢిని పంచమితిథినాడు పూజిస్తారు.
మరో కథనం ప్రకారం
ఓసారి కశ్యప మహర్షి తన భార్యలకు వరం ఇవ్వదలిచాడు. అమిత బలవంతులు, స్ఫురద్రూపులైన ఇద్దరు కొడుకులు కావాలని వినత కోరుకుంది. కద్రువ తనకు వేయిమంది సంతానం కావాలని కోరుకుంది. ఆ ప్రకారం కద్రువకు నాగులు జన్మించారు. కానీ వినతకిచ్చిన భాండాల్లో ఉన్న అండాలనుంచి ఆమెకు పిల్లలు లభించలేదు. దానితో ఆమె ఆత్రుతను అణుచుకోలేక తనకిచ్చిన అండాలను పగులగొట్టింది. దాని నుంచి పూర్తి అవయవాలు కుదురుకోని కుమారుడు వెలుపలకు వచ్చాడు. ‘అమ్మా అసూయతో నీవు నన్ను పూర్తిగా ఎదగకముందే పగులకొట్టావు కనుక ఆ అసూయనే నిన్ను నీ సవితికి దాసిని చేస్తుంది.’ అని శాపాన్నిచ్చాడు. దానికి వినత ఎంతో దుఃఖించి తన తప్పును క్షమించమని కోరింది.దానికి ఆ పిల్లవాడు రెండవ అండం నుంచి గొప్ప బలవంతుడు, వివేకశాలి అయిన కుమారుడు నీకు ఉదయిస్తాడు. అతడే నిన్ను దాస్యాన్నుంచి విముక్తురాలిని చేస్తాడు అని శాపవిమోచనాన్ని కూడా తెలిపాడు. ఆతరువాత అతడు సూర్యుని వాహనంగా మారాడు. అతడే అనూరుడు.
కొన్నాళ్ల తరువాత- ఓసారి ఇంద్రుని వాహనం ఉచ్చైశ్రవం కశ్యప మహర్షి నివాసమున్న ప్రదేశానికి వచ్చింది. కశ్యప మహర్షి భార్యలైన కద్రువ, వినతలు వ్యాహ్యాళికి వెళ్లి దూరాన నిల్చుని ఉన్న ఈ తెల్లని గుర్రాన్ని చూశారు. ‘ఆహా! ఏమి తెలుపుదనం’అనుకొన్నారు. వారిద్దరి మాటల మధ్య గుర్రం తోక నల్లగా ఉందని, తెల్లగానే ఉందని మాట పట్టింపు వచ్చింది. వీరిద్దరూ గుర్రం తోక రంగు కోసం పందెం వేసుకొన్నారు. ఒకవేళ నల్లగా ఉంటే కద్రువ వినతకు దాసీగా ఉండేట్లు, తెల్లగానే ఉంటే వినత కద్రువకు దాసీగా ఉండేట్లు మాట్లాడుకున్నారు.
కద్రువ ఇంటికి వచ్చి ఉచ్చైశ్రవం తోక ఒకవేళ తెల్లగానే ఉంటే అది తనకు ప్రమాదమనుకుంది. తన కొడుకులైన నాగులనుపిలిచి వారిని ఆ గుర్రం తోకకు చుట్టుకుని గుర్రం తోక నల్లగా కనిపించేట్టు చేయమని చెబుతుంది. నాగులు అసత్యదోషం తగులుతుంది కనుక మేము ఆపని చేయలేమని చెబుతారు. కద్రువ వారిపై మండిపడి మీరంతా జనమేజయుడు చేసే సర్పయాగంలో నాశనమవుతారని శపిస్తుంది. ఆ శాపానికి భయపడిన నాగుల్లో కొందరు ఆ గుర్రపుతోకకు చుట్టుకుని కద్రువను గెలిపిస్తారు. ఆ సందర్భంలో వినత కద్రువకు దాసీ అవుతుంది.
కాలక్రమంలో వినతకు గరుత్మంతుడు కుమారుడవుతాడు. తన దాస్య విముక్తి చేసే కుమారుడితడే అని వినత ఎంతో సంతోషిస్తుంటుంది. ఒకానొక రోజు గరుత్మంతుడు నాగుల దగ్గరకు వెళ్లి మమ్ములను దాస్య విముక్తులను చేయడానికి ఏమి చేయాలి అని అడుగుతాడు. నాగులు దేవలోకంలో ఉండే అమృతాన్ని తెచ్చి మాకిస్తే మీకు దాస్యవిముక్తిని కలిగిస్తామని చెబుతారు.
గరుత్మంతుడు అమరావతికి వెళ్లి అక్కడి ద్వారపాలకులను ఎదిరించి అమృతాన్ని తీసుకొని రాబోతుండగా మహావిష్ణువు గరుత్మంతుని సత్యధారణకు, నియమ నిష్టలకు అబ్బురపడి ఓ గరుత్మంతా నీ వినయానికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకోమని అన్నాడట. గరుత్మంతుడు నీ పాదసేవ తప్ప అన్యం వద్దు అని అన్నాడు. ఎంతో సంతోషించిన విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకొన్నాడట. ఆ పై ఇంద్రునికి చెప్పి గరుత్మంతుడు అమృతాన్ని నాగులకు ఇచ్చి తన తల్లిని కద్రువ నుంచి దాస్య విముక్తిని చేయంచాడు. ఆ రోజే శ్రావణ పంచమి. ఆ ఆనందంలో నాగులు తమను పూజించిన వారికి స్తుతించిన వారికి ఎన్నో వరాలను ఇచ్చారు. నాగులను సంపెంగ, సన్నజాజి, గనే్నరు వంటి పూలతో పూజిస్తారు. ఇలా అమృతాన్ని అందుకున్న రోజు శ్రావణ పంచమి అని ఈరోజున గరుడ పంచమి నోమును కూడా సుమంగళులు నోస్తారు. నాగులకు పాలు, పాయసం, నువ్వుల పిండి, చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సర్పదోషం తొలగుతుంది. వివాహాలు కానివారికి త్వరలో కల్యాణయోగం పడుతుందని నమ్ముతారు. నాగపంచమి విశిష్టతను పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా స్కాందపురాణం చెబుతోం ది. అగ్ని, నారదపురాణాలు కూడా నాగపంచ మి ప్రాశస్యాన్ని చెబుతాయ.

--చోడిశెట్టి శ్రీనివాసులు