Others

తమిళ దర్శకుడితో ఎన్టీఆర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఓ తమిళ దర్శకుడికి ఓకె చెప్పాడట? గత కొన్నిరోజులుగా సదరు దర్శకుడు ఎన్టీఆర్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ దర్శకుడు చెప్పిన సబ్జెక్టు విని ఎన్టీఆర్ ఓకె చెప్పాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు అని షాక్ అవుతున్నారా.. ఆయన ఎవరో కాదు అట్లీ కుమార్. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అట్లీ కుమార్ ఆ తరువాత విజయ్‌తో చేరి (తెలుగు పోలీసోడు) మెర్సల్ సినిమాలను తెరకెక్కించారు. ఆయనకు ఎప్పటినుండో తెలుగులో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. అతనికి టాలీవుడ్ అంటే చాలా ఆసక్తి వుందట. అందుకే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్, తన తదుపరి చిత్రాన్ని అట్లీతో చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ తరువాత ఆయన రాజవౌళి-చరణ్‌లతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు కాబట్టి, ఈ లోగా అట్లీ సినిమా పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. సో.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

సీక్వెల్‌కు సన్నాహాలు!

ఏంటి ప్రేమించిన అమ్మాయి విలన్‌గా మారితే పరిస్థితి ఏమిటి అని షాక్ అవుతున్నారా? నిజమే.. అతగాడి పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కోనున్నాడు కోలీవుడ్ స్టార్ విశాల్! గత కొన్నిరోజులుగా హీరో విశాల్, ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. శరత్‌కుమార్‌కు హీరో విశాల్‌కు మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ తరువాత ఈ వ్యవహారంపై పెద్దగా వార్తలు రావడం లేదు. ఈ విషయం పక్కనపెడితే తాజాగా హీరో విశాల్ నటిస్తున్న సినిమాలో విలన్ పాత్రలో వరలక్ష్మి నటిస్తుందట. హీరో విశాల్‌కు మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చిన ‘పందెంకోడి’ సినిమాకు సీక్వెల్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో లేడీ విలన్ ఉంటుందని, ఆ పాత్రకోసం వరలక్ష్మిని సంప్రదించినట్టు తెలుస్తోంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.