Others

తమిళ భరత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘్భరత్ అనే నేను’ చిత్రం భారీ స్థాయిలో విడుదలై అదే రేంజ్‌లో వసూళ్లు దక్కించుకుంది. ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘్భరత్ యానమ్ నాన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇటీవలే తమిళ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘్స్పఢర్’ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్‌కు అక్కడ విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ వుంది. తాజాగా భరత్ చిత్రం తెలుగు వెర్షన్ చెన్నయ్‌లో అత్యధిక వసూళ్లు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేస్తారట.