మెయిన్ ఫీచర్

వెంకీతో తమన్నా.. వరుణ్‌తో మెహరీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. సీనియర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్‌తేజ్‌లు తొలిసారి కలిసి నటించనున్నారు. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఎఫ్-2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు హీరోలు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా.. హీరోయిన్లను మాత్రం ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్‌లను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌తేజ్‌కు జోడీగా మెహరీన్ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.