AADIVAVRAM - Others

ఈ క్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా పని మొదలుపెట్టాలంటే ఈ రోజు కన్నా మంచి రోజు లేదని అంటాడు మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా. అక్కడితో ఆగకుండా ఈ సమయంకన్నా మించిన మంచి సమయం లేదని కూడా అంటాడు. అది వాస్తవమని అన్పించినా మనలో చాలామంది దాన్ని అంగీకరించడానికి వెనకాడుతారు. దానికి కారణాలు మనలో జీర్ణించుకు పోయిన నమ్మకాలు.
ఈ క్షణం కన్నా మంచి క్షణం లేదని మనం నమ్మితే మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి క్షణం బ్రహ్మాండమైన నమ్మకం మనలో ఏర్పడాలి.
మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఈ క్షణం మనకు అవకాశం కల్పిస్తుంది. ఆ రకంగా మనం చూడాలి. ఆ దిశగా చూడటం అలవర్చుకోవాలి.
క్షణంలోని వందోవంతు వల్ల ప్రమాదాలు తప్పిపోతున్నప్పుడు, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు క్షణం విలువైనదిగా మనం ఎందుకు భావించకూడదు. మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రతి క్షణం ఉపయోగపడుతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి.
ప్రతి దానికి ఈ క్షణం ఉపయోగపడుతుంది-
నేర్చుకోవడానికి-
ఓ చర్య తీసుకోవడానికి-
ఎవరినైనా ప్రోత్సహించడానికి-
ఏదైనా పనిని మళ్లీ చేయడానికి
మన పనిలో వేగం పెంచడానికి-
ఓ చిన్న చిరునవ్వు నవ్వడానికి-
మన దిశ మార్చుకోవడానికి-
తిరిగి నిల్చోవడానికి-
ఇతరులని ప్రోత్సహించుకోవడానికి-
ప్రేమించడానికి-
ఒక్క క్షణం చాలు.
భవిష్యత్తుని పాడు చేసుకోవడానికి కూడా ఒక్క క్షణం చాలు.
మంచి ముహూర్తం కావాలని మంచి అవకాశాలు రావాలని ఎదురుచూడటం మానేద్దాం.
మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని సక్రమంగా ఉపయోగించుకుందాం.
మనం ఎదురుచూస్తున్న అవకాశం మన ముందే వుండవచ్చు.
అందుకని ఈ క్షణాన్ని ఉపయోగించుకుందాం.
ఈ క్షణాన్ని ఉపయోగించుకున్నవాడే అదృష్టవంతుడు.
మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వాడు, ఎదురుచూస్తూ కూర్చున్న వాడు దురదృష్టవంతుడు.
అదృష్టవంతులం కావాలంటే ఈ క్షణాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి.

- జింబో 94404 83001