Others

దైవారాధనకు పవిత్ర మాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల ప్రమాణంలో చాంద్రమానాన్ని అనుసరించి రేండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారి ఒక నెల అధికంగా వస్తుంది. దీనినే పురుషోత్తమ (శూన్య లేదా మల) మాసం అంటారు. అధికమాసం దైవారాధనకు, భగవన్మామ స్మరణకు, నదీ స్నానానికి, దీపాది దానాలకు అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతుంది.
కలియుగం క్రీ.పూ.3102 ఫిబ్రవరి 20న మద్యాహ్నం 2గంటల 27నిమిషాల 30సెకండ్ల కాలమున ప్రారంభమైనదని భావించ బడుతున్నది. ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో 5,119 వత్సరాలు గడిచాయి. శంకరాచార్య (2089), శాలివాహన శకం (1940), రామానుజాచార్యులు (1001), భారత స్వాతంత్య్ర శకం (71-72), క్రీ.శ.2018-19 నడుస్తున్నాయి. భారతీయ ప్రాచీన కాలగణనా విధానం శాస్ర్తియ మైనది. ప్రతి సంవత్సరానికి 12మాసాలు ఉంటాయి.
కాని మూడు సంవత్సరాలకు ఒకసారి సూర్య చంద్రుల గతిలో కలిగే ఒక నెల భేదాన్ని సరి పెట్టడానికి పంచాంగ కర్తలు ఒక చంద్రుని మాసం అధికంగా కలపడం వలన 13వ నెల ఏర్పడుతుంది. చాంద్రమానం ప్రకారం సూర్యుడు ఒక రాశినుండి మరో రాశికి చేరే సమయం 29రోజుల 12గంటల 44నిమిషాలు. అంటే సంవత్సరానికి ఈలెక్కన 354 రోజుల 9గంటల సమయం అవుతుంది.
అంటే 365 రోజులకు దాదాపు 11రోజులు తక్కువ. అందుకే ఈవ్యతాసాన్ని సమం చేయడానికి మూడు సంవత్సరాలలో ఒక శూన్యమాసం ఏర్పడుతుంది. దీనినే అధికమాసం, పురుషోత్తమ మాసం, మలమాసం అని కూడా అంటారు.
ఈసారి శ్రీవిళంబి నామ సంవత్సరంలో జ్యేష్ట మాసం అధికంగా రావడం జరిగింది. దీని మాసాధిపతి శ్రీమహా విష్ణువు కనుక పురుషోత్తమ మాసమని పేరు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే తన పేరుతో ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అన్నాడని పద్మపురాణాధారం. ఇది సూర్య సంక్రాంతి రహిత మాసం. పండుగలు, ఇతర శుభ కార్యాలు నిజమాసమందే కాని, అధికమాసంలో చేయకపోవడం అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయం.
విశేషించి సర్వసంపద సమృద్ది, అనేక జన్మలలో చేసిన పాప వినాశనానికి విష్ణు ప్రీతికై సూర్యనారాయణుని అర్చించడం సదాచారం. పురాణాది పఠనాలు, రాత్రి ఏకభుక్తం లేదా పగలు ఏకభుక్తం, ఉపవాసం, వౌనవ్రతం, అఖండ దీపారాధన తదితర సత్కర్మలు ఆచరించడం పరిపాటి. నెల రోజుల పాటు శూన్యమాసంలో వివిధ కార్యకమాలు ఆచరించడం ఆనాదిగా వస్తున్నది.
ఈనెల 16న బుధవారం అధిక జ్యేష్ట ప్రారంభమైనది. ఈ మాసంలో 24న గంగా దశమి, 25న పద్మినీ ఏకాదశి, 26న శుక్ల ద్వాదశి, శని ప్రదోశమి (త్రయోదశి), 29న పౌర్ణమి, జూన్ 2న సంకష్టహర చతుర్థి, 8న నవమి, మృగశిర కార్తె ప్రవేశం, 10న పరమ ఏకాదశి, 12న మాస శివరాత్రి, కృష్ణ అంగారక చతుర్దశి, 13న అధిక జ్యేష్ట అమావాస్య (దర్శ) దాన ధర్మాచరణకు పవిత్ర దినాలుగా భావిస్తారు.
ఈ మాసంలో రానున్న శుక్లపక్ష ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని, కృష్ణపక్ష ఏకాదశిని పరమ ఏకాదశి అని అంటారు. వ్రతాచరణలో భాగంగా 33కోట్ల దేవతలను సంతృప్తి పరిచేందుకై వారికి ప్రతినిధియైన ప్రత్యక్ష దైవం సమస్త సౌర కుటుంబానికి పెద్దగా భావించే సూర్యునికి 33అపూపమలు, ఘృతము, పాయసము, దక్షిణలు, భక్ష్యములు ఉంచిన పాత్రలు, ఆవునెయ్యిని, బంగారమును కలిపి పాత్రదానం చేస్తారు. అలాగే 33మందికి ఫల, తాంబూల, మధుర పదార్థ, అన్న, దీప, శయ్య, గో, లక్ష్మీ నారాయణ ప్రతిమలను దానం చేస్తారు.
నారాయణ స్మరణ చేసినవారికి,తోటి వారికి సాయమందించిన వారికి విష్ణుసాయుజ్యం తప్పక కలుగుతుంది. నరుల్లో నారాయణుని చూసి సేవ చేసినవారి పట్ల నారాయణుడు అత్యంత అనుకూలుడై ఉంటాడు.