Others

సత్యానే్వషణం -- సత్యదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టి మొత్తం అనంతమైన చైతన్యంతో నిండి వుంది. చైతన్య శక్తికి సజీవ ఉదాహరణ ‘మనిషి’. మనిషి శరీరాన్ని మన ‘్భమాత’తో పోల్చవచ్చు. భూమి ఒక ప్లానెట్. ప్రతి మనిషినీ ఒక ప్లానెట్‌గా భావిస్తే మనిషి శరీర నిర్మాణాన్ని ‘‘విధాత’’ ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం అవుతుంది. సృష్టికర్తకు ఇలా మనిషిని తీర్చిదిద్దడానికి ఎన్ని వేల సంవత్సరాలైనా పట్టి వుండవచ్చుననిపిస్తుంది. మానవ శరీర నిర్మాణం- అందులోని గొప్పతనం- ప్రతి బాహ్యాంతర అవయవంలోని అద్భుతం జాగ్రత్తగా పరికించి స్టడీ చేస్తే!
మానవుని శరీరం- భూమి! చీము, నెత్తురు,నీరు- జలం! చైతన్యశక్తి- అగ్ని! ప్రాణశక్తి- వాయువు! వాక్కు- ఆకాశం!ఇక భూమధ్యం- సుషుమ్నానాడి; చంద్రుడు! శిరంపైన సుడి- బ్రహ్మరంధం; సూర్యుడు! మనిషి శరీరంలోని ఈ సప్త్ధాతువులను (పంచ భూతాలు, చంద్రుడు, సూర్యుడు) విశ్వంలోని పంచభూతాలు, చంద్రుడు మరి సూర్యునితో అనుసంధానం చేయడమే ఆధ్యాత్మికత! అదే ‘‘్భన్నత్వం నుండి ఏకత్వం’’ (దైవత్వం నుండి అద్వైతం)- ‘‘ఏకత్వం నుండి అసంతత్వం! దీనినే ‘విశ్వంతో అనుసంధానం’ అని చెప్పకోవచ్చు!
Duality, to individuality! Individuality to Infinity!
CONNECTIVITY WITH COSMOS
భౌతిక శాస్త్రం (Physical Science)పదార్థ జ్ఞానం గురించి మాత్రమే చెపుతుంది. అదే ఆధ్యాత్మిక శాస్త్రం (Spiritual Science) ఆత్మస్థితి గురించి ఆత్మజ్ఞానం గురించి చెపుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఎంతగా స్టడీ చేస్తే సాధనవల్ల బోధనవల్ల అంత గొప్పగా (Evolution) ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు’ అన్నారు కదా వీరబ్రహ్మేంద్రస్వామి! ఎంత అద్భుతంగా వారు చెప్పాడో క్రింద తెలుసుకుందాం! ‘్ధ్యనం’లో శ్వాస మీద దృష్టి నిలిపినట్లయితే, ఆలోచనా రహిత స్థితి క్రమంగా సిద్ధించి దృష్టి ఏకాగ్రమవుతుంది. ‘దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చు- దృష్టి నిలపడేని నష్టపడును; దృష్టిలోన సర్వసృష్టి పుష్టవౌను- కాళికాంబ! హంస! కాళికాంబ!’’ అన్నారు వారు.
చైతన్యశక్తి వల్ల- మనలో కుండలినీ ప్రయాణం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అంతరంలో! ఆ బ్రహ్మానందం అనుభవించవలసినదే కాని మాటలలో చెప్పడానికి వీలుకానిదది- అమృతం ఎలా వుంటుందో చెప్పడానికి ఏ భాషలో ఏ పదాలు సరిపోతాయి?
శబ్ద రూపాత్మకమైన ‘ఆకాశం’నుండి స్పర్శ కలిగిన వాయువు జనించింది. స్పర్శ కలిగిన ‘వాయువు’నుండి ‘రూపం’ కలిగిన ‘అగ్ని’ ఉద్భవించింది. రూపం కలిగిన ‘అగ్ని’ నుండి ‘రసం’ కలిగిన ‘జలం’ పుట్టింది.రసం కలిగిన ‘జలం’ నుండి ‘గంధం’ కలిగిన ‘్భమి’ సృష్టింపబడింది. ‘్భమి నుండి అన్నం- అన్నం నుండి బీజాలు, ఔషధాలు వచ్చాయి.’’ ఇది విశ్వవిస్తృతి- సృష్టి విలాసం- విధాత చమత్కారం- దానినుండి జీవరాసుల ఉత్పత్తి! విశ్వాన్ని, సృష్టిని మూల ప్రకృతి అని, సృష్టిలోని 24 తత్త్వాలను ప్రకృతి అని చెప్పుకోవాలి! మానవ శరీరం ‘్భమి’ అని చెప్పుకున్నాం.‘ఇది మూలాధారం’. దేహధర్మం! భూతత్త్వం! తాను, తన కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, రక్తస్పర్శ, అనుబంధాలు ఇలా!
‘మనస్సు స్వాధిష్ఠానం’. కోరికలు- కామం- మితృత్త్వం- శత్రుత్వం- ఆలోచన- పగ- ద్వేషం- ఇష్టం- సుఖం- దుఃఖం! జలతత్త్వం! ‘మణిపూరకం’ అంటే తేజం! పాండిత్యం- కళలు- గౌరవం- కీర్తి ప్రతిష్ఠం శాస్తజ్ఞ్రానం- శక్తి! ఎనర్జీ! విభూది! ‘అగ్నితత్వం’! అంటే చైతన్యం! ‘అనాహతం’ అంటే వౌనం- ప్రశాంతత- సంతృప్తి- ప్రేమ ప్రాణం! వాయుతత్వం!
‘విశుద్ధం’’ అంటే శుద్ధి- కర్మలు శుద్ధి అయేస్థితి- శుద్ధవాక్కు- సుశబ్దం- జ్ఞానం- వినయం- విశేషవాక్సుద్ధి! ఆకాశతత్వం!
ఈ అయిదు చక్రాలనూ పంచభూతస్థితులు అని చెప్పుకోవచ్చు! ఈ యొక్క పంచభూత స్థితిని దాటిన తర్వాత ‘ఆజ్ఞాచక్రం’! సుషుమ్నానాడి! చంద్రుడు! ఆత్మజ్ఞానం! ఆజ్ఞాస్థితి- అంటే ‘‘ఆజ్ఞ! ఆర్డర్! దివ్యచక్షువు యొక్క పూర్ణత! అష్టసిద్ధులు! నవనిధులు! ‘అహం’కారం- అంటే ఆత్మస్థితి! ఆత్మతో ప్రవర్తించడం! దేహంతో ఉంటూ దేహభావన లేకపోవడం! దివ్యదృష్టి, దివ్యశ్రవణం! దివ్యయానం! దివ్య జీవనం!

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908