Others

నేను మార్క్సిస్టును కాను: మార్క్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మార్క్సిస్టును కాను’ అని ఆ రోజుల్లోనే కారల్‌మార్క్స్ స్వయంగా పేర్కొన్నట్టు ఇటీవల కొన్ని పత్రికల్లో సమాచారం అచ్చయింది. కారల్‌మార్క్స్‌పై కీర్తనలు వెలువడిన సందర్భంలోనే ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయనా దానిపై చాలామంది అంతగా దృష్టి సారించలేదు.
ఓరి దేవుడా, నేను మార్క్సిస్టును కానని మార్క్స్ చెప్పినపుడు ఇక ఆయన పేర మార్క్సిజానికి విలువ ఎక్కడిది? అని చాలాకాలంగా వినిపిస్తున్న మాట మరోసారి వెలుగులోకి వచ్చింది. చారిత్రక భౌతికవాదం ప్రకారం వాస్తవ జీవన ఆవిర్భావం, పునరావిర్భావం మాత్రమే చరిత్రను నిర్ణయించే అంశం. ఇంతకుమించి మార్క్స్‌గాని, నేను (ఏంగిల్స్)గాని ఏనాడు చెప్పలేదని ఏంగిల్స్ తన మిత్రుడికి 1890 ఆగస్టు 5న రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమూ మరోసారి తెలుగువారి ముందుకొచ్చింది. ఈ వౌలికాంశాన్ని వక్రీకరించి మార్క్స్ అభిమానులు, ఆరాధకులు గత నూట ముప్ఫై ఏళ్ళలో ఎంత మాయ చేశారు? లెనిన్, స్టాలిన్, మావోతో సహా ఎవరికిష్టమొచ్చిన రీతిలో వారు ఆ మూల భావనకు వ్యాఖ్యానంచేసి, ఆ ఆలోచనను భ్రష్టుపట్టించి మైలపరిచారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ గంభీరమైన విషయాన్ని చాలామంది ప్రస్తావించినప్పటికీ, గుర్తుచేసినప్పటికీ ఆ వాదనను కప్పిపుచ్చడానికి, బుల్డోజ్ చేయడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు పకడ్బందీగా చేపట్టారు. ఆ విధంగా ఆ సత్యాన్ని చాలా చాకచక్యంగా తొక్కి పెట్టారు. విజయవంతంగా వాస్తవాన్ని అట్టడుక్కి అణచిపెట్టారు. ఆ కళలో మార్క్స్ అభిమానులు, ఆరాధకులు ఆరితేరారు. ఆ కళాత్మక ధోరణిని రసజ్ఞతతో పోషిస్తున్నారు.
నేను మార్క్సిస్టును కాను.. అని మార్క్స్ ఒకసారి కాదు అనేకసార్లు పేర్కొన్నపుడు, ఆ విషయం ‘రికార్డు’ అయినపుడు, కమ్యూనిస్టు ప్రణాళికను మార్క్స్‌తో కలిసి రాసిన ఫ్రెడరిక్ ఏంగిల్స్ ఈ విషయాన్ని తన లేఖలో ఇతరులకు తెలియచేసినపుడు దాన్ని ఇంతగా దాచాల్సిన ఆవశ్యకత ఏమిటన్న మాట సహజంగానే తలెత్తుతుంది కదా? తలెత్తినా దాన్ని తొక్కిపెట్టడానికి సిద్ధం కావడమంటే మార్క్స్ అభిమానుల్లో ఆరాధకుల్లో నిజాయితీ కొరవడినట్టే కదా? ఆ అపరాధ భావంతోనే ఇన్ని తరాల వరకు ఆ సత్యాన్ని దాచేస్తున్నారు. ఆ మాటను అసందర్భంగా మార్క్స్ వ్యతిరేకులు ఉటంకిస్తూ తమ ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. తొలినుంచి వారి వ్యవహారమంతా ఇంతే.. ఎదురుదాడి చేసి, నోళ్లు మూయించే నైపుణ్యం సంపాదించి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ రకంగా తమ దూకుడుతో ఆకట్టుకునేందుకు, అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతిమంగా దానే్న ‘సిద్ధాంతం’గా మార్చుకున్నారు. మార్క్స్ ఆలోచనలు, అభిప్రాయాలను కల్తీ చేసి, తమకు అనుకూలంగా మార్చుకుని, మాయచేసి, దాన్నొక ‘మతం’గా మార్చి మానవాళిపై దాడి చేయడం, దానే్న కీర్తించడం, వక్రీకరణలే పరమ సత్యాలని, వాటన్నింటినీ మార్క్స్‌కు ఆపాదించి ఆయన పేర అగ్నిగుండాలను రాజేసి అమాయకులను ఆహుతి ఇవ్వడం ఎంతవరకు న్యాయం?
ఆర్థికం.. నిర్ణయాత్మకం కాదు
‘‘ఆర్థికాంశమే నిర్ణయాత్మకమైనదని ఎవరు చెప్పినా వారు మా ఆలోచనలను, భావాలను మంటగలిపినట్టే’’ అని ఏంగిల్స్ ఆనాడే పేర్కొన్నాడంటే అసలు ఏది మార్క్సిజం? .. ఏది కాదు.. అన్న సంశయం తప్పక కలుగుతుంది. ఇన్ని దశాబ్దాలపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అంతరాలను, ఆర్థికాంశాల్ని ప్రచారంలో పెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి, కోట్లాది మంది ప్రజల ఉసురుతీసి, రక్తసాకారాలు సృష్టించి, జరిగిన అభివృద్ధిని సైతం ధ్వంసం చేసి, ఇంకా ఆ కార్యక్రమాల్లోనే మునిగితేలుతున్న మార్క్స్ అభిమానులను, మావోయిస్టులను ఎవరు క్షమిస్తారు? అసలు క్షమించదగ్గ నేరాలేనా అవి?
వందేళ్ళ క్రితం, రష్యా విప్లవం అనంతరం జర్మన్ తదితర దేశాల్లో మరింత ఉధృతంగా విప్లవాలు వస్తాయని ఆనాటి నాయకులు అంచనా వేసినా, ఆశించినా అది జరగలేదు. రష్యా విప్లవం ఒంటరిగా మనగలగదని తెలిసినా, ఆశించిన రీతిలో ఇతర సమాజాల నుంచి మద్దతు లభించని సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన నాయకులు మానవాతీత శక్తులు ఆవహించినట్టు వ్యవహరించడంతో మానవ జాతి కోలుకోలేని నష్టానికి గురైంది. ఏ మానవులను సంస్కరించి, ఎవరిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనుకున్నారో అలాంటివారిని సైతం ఆహుతిచ్చారు, అంతమొందించారు. అమానవీయంగా ప్రవర్తించి అడ్డగోలుగా శ్మశాన దిబ్బలు పెంచారు.
అధికారం సంపాదించి నిరంకుశంగా వ్యవహరించడం మార్క్స్ ఆకాంక్ష కాదని మార్క్సిజాన్ని అర్థం చేసుకుని చెబుతున్న దానికి రష్యా, చైనాలో జరిగిన దానికీ, వర్తమానంలో మావోయిస్టుల కార్యకలాపాలకు, వారి రక్తచరిత్రకు, రక్తదాహానికి ఎక్కడైనా పొంతన కుదురుతున్నదా? అయినా నిర్లజ్జగా ఇంతవరకు పదికోట్లమందిని ప్రపంచ వ్యాప్తంగా మార్క్సిజం పేర పొట్టన పెట్టుకోవడం ఏ రకంగా అర్థం చేసుకోదగ్గ పరిణామం?
మార్క్సిజం - వెర్షన్లు
ప్రపంచంలోని పలు దేశాల్లో పలు రకాలుగా రూపాంతరం చెందిన మార్క్స్ ఆలోచనలు భారతదేశ విషయానికొచ్చేసరికి అనేక పార్టీలు, గ్రూపులు, ముఠాలుగా ముందుకొచ్చాయి. ఇందులో ప్రతి ఒక్కటీ తమదే నికార్సయిన మార్క్సిజం అని బాంబులేసి మరీ ప్రకటించుకుంటున్నాయి. దాదాపు ఇదే పరిస్థితి ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. అంటే మార్క్స్‌కు ఎన్ని వెర్షన్లు వెలుగుచూసాయో దీనివల్ల మరోసారి తేటతెల్లమవుతోంది.
నేను మార్క్సిస్ట్‌ను కాను బాబోయ్.. అని మార్క్స్ స్వయంగా చెప్పినా ఇన్ని వందల వెర్షన్లు వెల్లువెత్తాయంటేనే నిజాయితీ నిండుకున్నదని అర్థం.
ఈ వౌలికాంశాన్ని గుర్తెరగకుండా మరింత ముతకధోరణిలో వ్యవహరించడానికే ఇష్టపడటమంటే వారి ఆచరణ ఎంత మోసపూరితమో ఇట్టే వెల్లడవుతోంది. ప్రజల మనో విశే్లషణలను, ఆకాంక్షలను అభీష్టాలను ఎప్పుడూ ఈ ఆరాధకులు పట్టించుకోలేదు, గౌరవించలేదు. ఫ్రాయిడ్‌ను సైతం పట్టించుకోకుండా, ఆయనను సైతం తూలనాడుతూ దూరంగా పెట్టడంతో మరింత మూర్ఖంగా ముందుకు పోయేందుకు నిశ్చయించుకున్న విషయం స్పష్టమైంది. ఇప్పటికీ ఇదే పద్ధతిని ప్రాణప్రదంగా భావిస్తున్నారు. మావోయిస్టులయితే ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇదా అసలు మార్క్సిజం సారాంశం? దేశంలో అంబేద్కరిస్టులు, ఇతర భావధారలను అనుసరించేవారు ఎంత విమర్శను ముందుకు తెచ్చినా మార్క్సిస్టులు - మావోయిస్టులు పాత పారిభాషిక పదాలతో నోరు మూయించే పనిలో ప్రావీణ్యం సంపాదించి అమలు జరుపుతూనే ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లిన విషయాన్ని ప్రస్తావించినా పట్టించుకోకుండా ‘వర్గ కసి’ గూర్చి, వర్గ పోరాటాల గూర్చి ప్రసంగించడం అలవర్చుకున్నారు. మార్క్స్ చెప్పిన చారిత్రక భౌతికవాదాన్ని తమ అవసరం కోసం విస్మరించి ఏమార్చి అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు.
మార్క్స్ పేరు బద్‌నామ్
వాస్తవానికి మార్క్స్ పేరును బద్‌నామ్ చేస్తూ బందూకులు ధరించి దండకారణ్యంలో మకాం వేయడంవల్ల మార్క్సిజం సమాజంలో ‘ఇంకు’తుందా? లేదు! కాని తామే భారత్‌లో మార్క్స్‌కు నిజమైన వారసులమని పేర్కొంటూ ప్రజా సైన్యం నిర్మించేందుకు ఆదివాసీలకు ఆయుధ శిక్షణ ఇవ్వడం చూస్తే మావోల మార్క్సిజం పరిజ్ఞానం ఏపాటిదో అర్థమవుతుంది!
మార్క్సిస్టు వాస్తవ జ్ఞానం ఉన్నా, లేకున్నా ఆ ఆలోచన 150 ఏళ్ళ క్రితపుదన్న ఊహ కూడా చేయకుండా వక్రీకరణ చెందిన అంశాలే ప్రామాణికమని భావించి ఆధునిక సాంకేతికతను విస్మరించి ఆధునిక ఆయుధాలతో మానవ హననానికి పాల్పడితే ఎవరైనా ఎలా స్వాగతిస్తారు? వర్తమాన కాలానికి అనుగుణమైన విషయాలపైనే దృష్టి నిలిపి ప్రజా జీవితాన్ని మెరుగుపరిచే ఆలోచనలు- ఆచరణ అత్యంత కీలకమని వీరు ఎప్పటికి గ్రహిస్తారు? నేను మార్క్సిస్టును కానని మార్క్సే చెప్పినా కమ్యూనిస్టుల, మావోయిస్టుల చెవికి ఎక్కకపోవడం ఎంతటి అమానవీయమో? రాజకీయ చైతన్యంగల ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన సమయమిది! విధ్వంసానికి వీడ్కోలు పలికి జ్ఞానదారుల్లో ఎర్ర తివాచి పరచాల్సిన తరుణమిది!

- వుప్పల నరసింహం 99857 81799