Others

సదాస్మరామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మ’ అన్నది ఒక తియ్యని పిలుపు
అసమానమైనది, విలువ కట్టలేనిది నీ అనురాగం
నిరంతరం మా సుఖ సంతోషాలను కోరే అనురాగ దీపికవు
బుజిబుజి మాటల నుండి బుద్ధిమంతుణ్ణి చేసే వరకు
బిడ్డకు ప్రథమ గురువు పాత్ర పోషిస్తూ
నాటి ఛత్రపతి, మొన్నటి మహాత్ముడు
నిన్నటి అబ్దుల్ కలాం, నేటి దేశాధ్యక్షుల
జీవితాలను మలచిన ఓ మాతృమూర్తీ!
బాధ్యతల భారాన్ని భరిస్తూ మా భవిష్యత్తును తీర్చిదిద్దిన త్యాగమయివి
తప్పటడుగులను సరిదిద్దుతూ
తెలియనివ్వక నీ బాధలను
కావాలని సత్ప్రవర్తనులుగా
కాంక్షతో సుఖాన్ని మరచి సమిధగా మారుతావు
నిన్ను నీవు దహించుకొంటూ కొవ్వొత్తిలా
నింపుతావు వెలుగులను మా జీవితాలలో.
మా బాధలను నీ బాధలుగా స్వీకరించి
మా బంగారు భవిష్యద్బాటకు
ఆత్మవిశ్వాస పాఠాలతో
అహర్నిశలూ కృషిచేసే అమ్మవు.
తరువుకు కాయభారం కాదు
కనిపించే తల్లికి పిల్ల
భారమనే భావన లేకుండా
బాధ్యతనే భావనతోనేకాక
అనిర్వచనీయమైన ఆర్ద్రత భావంతో
అనురాగాన్ని పంచే పవిత్ర హృదయం నీది.
పుత్రుడు పాదుషా అయినా ఢిల్లీకి
పుడమి మీద బిడ్డే తల్లికి.
నదులు స్ర్తినామ సంబోధితాలయినా
అమ్మ శబ్ద అనుసంధానంతో
ఆపాదింపబడ్డ అతి పవిత్రత.
అందుకే అంటాము పుడమి తల్లి, చదువులతల్లి,
కృష్ణమ్మ, గంగమ్మ, తల్లి గోదారని.
ఆనందం, ఆరోగ్యం కోసరమే కాదు
అందమైన భవిష్యత్తుతో తీర్చిదిద్దే అమ్మకు
సర్వదా కృతజ్ఞతా భావంతో
సమున్నత స్థాన కల్పనతో
సదాస్మరామి..
*

--వేదం లీలావతి 9490125614