Others

అతను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను-
ఆశలో నావలో-
అలల కలల తీరంలో
అలా - అలా - అనంతంగా
పయనిస్తూ ఉంటాడు.
వేకువ రేకులు
వెలుగు రేఖలతో
కబుర్లు చెప్పేలోపు-
రేపటి రేవుకు -
తీరం చేరని నావలెన్నో?
చీకటి కౌగిట్లో-
చితికిపోయే బతుకులెన్నో?
అతనొక ప్రేక్షకుడు
విధిరాత వీక్షకుడు-
అచేతనం - అతని చూపు
అసంగతం - ఆ ఎదురుచూపు!
ఆశ మాత్రం-
ఆకాశమంత ఎత్తులో
ఆశయ శిఖరం చేరాలని
ఆరాటపడుతూనే ఉంటుంది
ఆఖరి నిమిషం వరకూ-
పోరాటం చేస్తూనే ఉంటుంది
ప్రయత్నం - విరిగిపడిన అలలా
జీవన తీరాన్ని ముద్దాడుతుంది
ప్రగతి - తిరుగుతున్న భూమిలా
స్వప్నలోకాన్ని - స్వాగతిస్తుంది!
అతనొక స్వాప్నికుడు-
విసుగులేని విక్రమార్కుడు! *

-మరువాడ భానుమూర్తి 8008567895