Others

కల నిజమాయెలె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారంతా కష్టపడితే కాని కడుపు నిండని బాలికలు.. అమ్మానాన్నలు లేని అనాథలు.. ఇళ్లలో, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పని చేస్తూ సాయంత్రానికి ఏ నీడకో చేరి సేదతీరుతుంటారు.. ఎవరికీ పట్టని ఈ బాలికలకు ఆటపాటలంటే మహా ఇష్టం.. చెన్నైలోని పలు మురికివాడల్లో ఉంటున్న వీరికి ‘కరుణాలయ’ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయం కల్పించింది. ఫుట్‌బాల్ అంటే తెగ ఇష్టపడే ఈ బాలికలు తాము కూడా పెద్ద పెద్ద స్టేడియంలలో ఆడాలని కలలు కనేవారు. ఈ విషయాన్ని గమనించిన ‘కరుణాలయ’ నిర్వాహకులు వీరికి ఫుట్‌బాల్ క్రీడలో తర్ఫీదు ఇప్పించారు. కలలో కూడా ఊహించని విధంగా ఈ వీధిబాలలు కొద్దిరోజుల క్రితం మాస్కోలో జరిగిన ‘స్ట్రీట్ చైల్డ్ వరల్డ్ కప్’ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నారు. తొమ్మిదో తరగతితో చదువు ఆపేసి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 17 ఏళ్ల సంగీత ఫుట్‌బాల్ జట్టుకు నాయకత్వం వహించింది. ‘కరుణాలయ’లో ఆశ్రయం పొందిన బాలికలు ఇపుడు చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ రాణిస్తున్నారు.