Others

మహిళలు భుజంగాసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసనాల వల్ల మహిళలు ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎక్కడ వంగాలన్నా, లేవాలన్నా తటపటాయంచకుండా పనిని చేసేయగలగాడానికి శరీరానికి కొద్దిపాటి వ్యాయామం అవసరం. అట్లాంటి వ్యాయామాల్లో భుజంగాసనం ఒక్కటి. ఈ ఆసనం అన్నింటిలోకి సులువైనది. ఈ ఆసనం చేసి పూర్తి ఫలితాలను పొందాలంటే ఈ ఆసనం గురించి తెలుసుకొందాం.
ఈ భుజంగాసనం వేయడంలో కొన్ని జాగ్రత్తలు : విరామ స్థితిలో ఉన్నప్పుడు ఈ భుజంగాసనాన్ని ప్రయత్నించాలి. ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెనె్నముక కండరాలు వత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడాలి.
అలాగే ఆసనాన్ని నెమ్మదిగా వేయడానికి ప్రయత్నించాలి.
భుజంగాసనాన్ని శలభాసనం, ధనురాసనాలతో కలిపివేయాలి. ఈ మూడు ఆసనాలు కలిపడం వల్ల ఇది సంక్లిష్టం అనిపిస్తుంది కాని ఈ ఆసనం ప్రతిరోజు వేస్తుంటే చాలా సులభంగా ఉంటుంది.
ఈ మూడు ఆసనాలు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలే హలాసనం, పశ్చిమోత్తాసనాలు
భుజంగాసనం వేయు విధానం
మకరాసనంలో విశ్రాంతిగా వుండండి
కాలి మడమలను బొటన వే ళ్లను కలిపి వుంచి బోర్లా పడుకోవాలి.
చుబుకాన్ని నేలకు ఆనించాలి
అరికాళ్లు పైవేపుకు తిరిగి ఉండాలి.
మోచేతులను వంచి అరచేతులను ఆఖరి పక్కటెముక పక్కగా వుంచండి
మోచేతులను దగ్గరగా వుంచాలి. చేతులపై ఎక్కువ బలాన్ని ఉంచొద్దు
ముందుగా తలను పైకెత్తుతు తాచుపాము పడగెత్తినట్టు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తండి
నాభిస్థానమును నేలకు అంటీ అంటనట్టుగా ఉంచాలి.
తిరిగి మెల్లగా మకరాసనానికి రావాలి.
ఈ ఆసనంతో ప్రయోజనాలు:
రుతు క్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం ప్రత్యేకంగా లబ్ధి చేకూరుస్తుంది.
అండాశయం మరియు మూత్రాశయానికి సంబంధించిన సమస్యలను ఇది నివారిస్తుంది.

- జె. శ్యామ సుందరి