Others

మనసే మందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీలో రాజేంద్రకుమార్, మీనాకుమారి, రాజ్‌కుమార్ నటించిన ‘దిల్ ఏక్ మందిర్’ చిత్రాన్ని తెలుగులో ‘మనసే మందిరం’గా నిర్మించారు. 1960లో ‘పెళ్లికానుక’ వంటి విజయవంతమైన చిత్రాల్ని అందించిన శ్రీ్ధర్ ఈ చిత్రానికి దర్శకుడు. అక్కినేని, సావిత్రి, జగ్గయ్యతో నిర్మించబడిన ఈ చిత్రం విలువలపరంగా ఎంతో విశిష్ఠతను సంతరించుకుంది. కేవలం మూడు ప్రధాన పాత్రలతో వైద్యాలయం నేపథ్యంలో సాగే ఈ చిత్రం అపురూప చిత్రంగా అందరి మన్ననలు అందుకున్నది. అక్కినేనిని ప్రాణాధికంగా ప్రేమించిన సావిత్రి, అనివార్య కారణాలవలన జగ్గయ్యను వివాహమాడి, ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న భర్తను ఆ వ్యాధిని బాగుచేయగల డాక్టర్ అక్కినేని దగ్గరకు తీసుకుని వచ్చి ‘నా భర్తను బతికించు’అని బాధ్యతను అప్పగించడం లాటి ఒక వినూతనమైన కథ! డాక్టర్ రఘుగా అక్కినేని, భార్యాభర్తలు రాము, సీతలుగా జగ్గయ్య, సావిత్రిలు ఆయా పాత్రలకు ప్రాణంపోసారు. తన భర్తను నయం చెయ్యగలిగే నిపుణుడు డాక్టర్ రఘు, తన ఒకనాటి ప్రేమికుడే అని తెలిసినప్పుడు సావిత్రి నట హావభావాలు అద్భుతం! ఒకనాటి ప్రేమికుల ఫొటో అక్కినేని దగ్గర ఉంటే, దాన్ని తిరిగి ఇవ్వవలసిందని సావిత్రి అక్కినేనిని అడిగే సన్నివేశం, ‘నేను చనిపోతే మీ ఇద్దరూ వివాహం చేసుకోవాలి’అని జగ్గయ్య సావిత్రి, అక్కినేనిని అభ్యర్థించే సన్నివేశం, ఆపరేషన్ విషయంలో అక్కినేనిని కాసింత అనుమానిస్తూ సావిత్రి మాట్లాడిన సన్నివేశం ఈ చిత్రానికి ఊపిరిపోసాయి. అక్కినేని, సావిత్రి ఎందుకు మహానటులయ్యారో, అద్భుత నవరసాల నటనారథానికి సారథులయ్యారో పై మూడు సన్నివేశాల్లో తెలుస్తుంది. జగ్గయ్య కూడా ఏం తక్కువ చెయ్యలేదు. తన భార్య పూర్వప్రేమికుడు అక్కినేనే అని తెలిసిన సన్నివేశంలో ఆహా అనిపించారు. రేలంగి, గిరిజ, శారద, నాగభూషణం, గుమ్మడి, చలం, శాంతకుమారిలు అతిథిపాత్రల్లో అలరించినా మూడు ప్రధాన పాత్రలతోనే చిత్రమంతా హాస్పిటల్ నేపథ్యంలో సాగుతుంది. అక్కినేని చిత్రానికి ఎమ్.ఎస్.విశ్వనాథం సంగీతం ఒక విశేషమైంది. పాటలకు, మాటలకు ఆత్రేయ జీవంపోస్తే, ఘంటసాల, సుశీల ఊపిరైనారు. కృష్ణసాయి ఫిలింస్ బ్యానర్‌లో నిర్మాణమై అక్టోబర్ 6వ తేదీ 1966లో విడుదలైన ఈ సినిమా అంటే అందుకే నాకెంతో ఇష్టం!!
- తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం