Others

‘అన్నా.. నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి రచన, టి.చలపతిరావు సంగీత మాధుర్యంలో పి.సుశీలగారు ‘ఆడపడుచు’ చిత్రంకోసం పాడిన పాట ‘అన్నా నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం’. అందరినీ అలరించే అనురాగ భరిత గీతమిది. ఈ చిత్రంలో చంద్రకళ ఇద్దరన్నయ్యలుగా ఎన్టీఆర్, శోభన్‌బాబు నటించారు. అన్నయ్యలకు చెల్లెలంటే ఎనలేని ప్రేమ, మురిపెం, గారాబంగా చూసుకొంటారు. అలాగే అన్నయ్యలంటే ఆ చెల్లెలికి అపురూపం. అందుకే ప్రతి చెల్లికి మంచి అన్నయ్య దొరకడం అదృష్టం. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర అద్భుతం. అద్వితీయం. పరిస్థితులు వికటించి తన అన్నయ్యలకి దూరమై అంధురాలిగా మారుతుంది చెల్లెలు. ఆమెలో అన్నయ్యల పట్ల వున్న అనురాగమే వారితో ఆమె తిరిగి కలుపుతుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే ఈ పాట ఇప్పటికీ శ్రోతలను మురిపిస్తుంది.. మైమరపిస్తుంది. సుశీలగారు ఎంతో హృదయాత్మకంగా ఆలపించిన కమ్మని మధురమైన ఈ పాట మధురం... మనోహరం.
- కాయల నాగేంద్ర, హైదరాబాద్