Others

రీఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా భామ ఇలియానా అంటే సౌత్ ప్రేక్షకులకు ఇప్పటికీ అదే క్రేజ్ వుంది. ఘాటు అందాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ భామ, బాలీవుడ్‌లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. చాలారోజుల తరువాత మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. మాస్‌రాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో హీరోయిన్‌గా ఇప్పటికే అను ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారు. కొద్దిరోజుల తరువాత అను, తనకు డేట్స్ సమస్య ఉందంటూ తప్పుకోవడంతో ఇప్పుడామె ప్లేస్‌లో వేరే హీరోయిన్ కోసం అనే్వషణలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలియానాను ఇందులో హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇలియానాతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా, బాలీవుడ్‌లో వెలగాలనే ఆశతో ఇక్కడి అవకాశాలను వదులుకునిపోయింది. బాలీవుడ్‌లో రెండు, మూడు సినిమాల్ని చేసినా కెరీర్ పరంగా సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గాయి. అందుకనే మళ్లీ సౌత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తోందట. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మరి ఇంకో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సివుంది.
బాబి, తన తదుపరి ప్రయత్నంగా ఈ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే వెంకటేష్, చైతులకు స్క్రిప్ట్ వినిపించి ఓకె చేయించాడు. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకటేష్, చైతులు మామా అల్లుడుగా కనిపిస్తారట. రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరూ మామా అల్లుళ్లు కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తెస్తారట. మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.