Others

మునిమాపువేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడమటి కొండల్లో
అలసిన ఎర్రటి సూరీడు
వాలిపోతుంటే
మళ్లీ వీలుకాదేమోనని
గువ్వలు చివరి ఊసు ఏదో
సూరీడి చెవులో ఊదడానికి
గగనతలాన వరుసకట్టిన
తరుణంలో.. కొలను గట్టున
పున్నాగపూలచెట్టు నీడలో
మేనిలో వాసంత సమీరాల
చిరుస్పర్శలు
మదిలో నీ ఊహల గిలిగింతలు
కొలనులో కలువల కమ్మని కబుర్లు
కనులలో కనుపాపల కలవరింతలు
గుడిలో గుడిగంటల సందడిలో
వేదమంత్రాల శ్రావ్యనాదాలు
నా గుండెలో మ్రోగుతున్న
వౌన రాగాలు
కరిగిపోతున్న క్షణాలను
కోనేటి నీటిచుక్కల్లో లెక్కిస్తూ
నేను కాలాన్ని మరచిపోతున్న వేళ
ముసిరిన చీకట్లను
ముందుగా పసికట్టిన నక్షత్రం
కొలనులో కనిపించి
నను చూసి నవ్వినపుడు
నీవు రాలేదనే స్ఫురణ వస్తుంది
వాడిన పున్నాగపూలను
వీడలేని పరిమళాలను
మోసుకుంటూ
మరో మునిమాపువేళకై
మొలకెత్తుతున్న ఆశలు! *

-సురేంద్ర రొడ్డ 9491523570