Others

స్వాధ్యాయ సందోహం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఎవడు దేనిని చేస్తాడో వాడు దాని ఫలాలనే అనుభవిస్తాడు. స్వాతంత్య్రముంది కదా అని దానిని ఏ విధంగా ఉపయోగిస్తామో దాని ఫలితాలు కూడా దానికి తగినట్లుగానే ఉంటాయి. ఈ అభిప్రాయానే్న వేదంపై మంత్రంలో ‘స సద్రీచీః స విషూచీర్వసానః’ అనే వాక్యం ద్వారా స్పష్టపరచింది. అంతేకాదు పరోక్షంగా చేసిన కర్మకు లోకంలో ఫలితమనుభవించాలనే కర్మఫలవాదాన్ని కూడా సూచించింది.
5.ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలిపేందుకే వేదం పై మంత్రంలో ‘ఆ వరీవర్తి భువనేష్వంతః’- ‘ఆత్మ మరల మరల ఈ లోకంలో శరీరాన్ని ధరించి జన్మిస్తూ వుంటుంది’ అని వివరించింది. దీని అంతరార్థమేమంటే- లోకంలో ఏ ప్రాణి అయినా పలు కష్టాలననుభవిస్తూ బాధపడుతూ కనబడితే అది తన ఆత్మకు గల స్వతంత్రతను దుర్వినియోపరచిందని అర్థం. అంతేకాదు, అతడనుభవించే ఆ దురవస్థలు హఠాత్తుగా - నిష్కారణంగా వానికి సంభవించలేదని కూడా గ్రహించాలి. కాబట్టి సత్కర్మగా దుష్కర్మగాని చేసేందుకు స్వాతంత్య్రం కలిగియున్న ఆత్మ ఆ కర్మఫలాలనుభవించే విషయంలో మాత్రం పరతంత్రం కలదే.
ఈ విధంగా ‘ఆత్మ’తత్త్వాన్ని గూర్చి వివరింపబడిన అంశాలన్నీ యుక్తియుక్తమేనని వేదం పై మంత్రంలో ‘అపశ్యమ్’ - నేను చూచాను అన్న వాక్యం ద్వారా స్పష్టం చేసింది. దీని ద్వారా వేదం ‘ఓ మానులారా! ఆత్మ సంబంధమైన ఇట్టి స్వభావాన్ని గ్రహించుకోండి. అనుభవం పొందండి’ అని హెచ్చరిస్తూంది.
ఆధ్యాత్మవిదుడయిన వేదర్షి యాజ్ఞవల్క్యుడు ఆత్మను గురించి ఎన్నో విషయాలను వివరించారు.
ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యోః మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయి
ఓ మైత్రేయి! ఆత్మను దర్శించు. శ్రవణం, మననం మరియు నిదిధ్యాసనం చెయ్యి. ఈ మూడు ఆత్మ సాక్షాత్కర సాధనాలు.
శ్రోతవ్యః శ్రుతివాక్యేభ్యః- వేదవచనాలను విని ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు వేదం కంటె మించిన ఉత్తమ గ్రంథం లోకంలో మరేదీ లేదు. ఆత్మను తెలుసుకొనవలెననే కోరిక కలవాడు విధిగా వేదాన్ని చదవాలి.
మంతవ్యశ్చోపపత్త్భిః- ఆ వేదమంత్రార్థాలను హేతుబద్ధంగా విచారణ చేయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వేదమనే పేరు పెట్టి వేద విరుద్ధమైన విషయాలను చెబితే అవి నిజంగా వేదార్థలే అని భ్రాంతిలో పడకు. వానిని ‘మంతవ్యశ్చోపపత్త్భిః’ హేతుబద్ధంగా విచారించి గ్రహించు. అందుకే తర్కశాస్త్రం శాస్త్రాలలో ఆధ్యాత్మ విద్యాశాస్త్రంగా అంగీకరించబడింది. నిదిధ్యాసితవ్యః- లోకంలో మతమనే పేరుతో మనిషి భయాన్ని పొందుతాడు. చివరికి దాని గురించి తార్కింగా ఆలోచించేందుకు కూడా భయపడతాడు. అలా భయపడే మనిషి మతాన్ని గురించి కేవలం నిస్సారమైన సత్యాలనే గ్రహిస్తాడు. వెనుకటి మంత్రంలో చెప్పిన రీతిగా శ్రవణ- మననాల తరువాత ఆత్మజ్ఞానం కలిగే అంశంలో నిదిధ్యాసమనేది కూడా ప్రాధాన్యం వహిస్తుంది. అంటే విన్నదానిని, మననం చేసినదానిని అనేక పర్యాయాలు దానిని ఆచరణలో పెట్టడమే నిదిధ్యాసనం. దీనిని బట్టి కేవలం ఒకసారి వినడం ఒకసారి విచారించడం చేత సాఫల్యం సిద్ధించదు. దానిని ఆచరణలో పెట్టినపుడే సాఫల్యం సిద్ధిస్తుంది.
ఈ విధంగా శ్రవణ - మనన - నిదిధ్యాసనాలను ఎవడు చేస్తాడో అతడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలడు.
దీనిని గూర్చి అడిగేందుకు ఎవడు వెళతాడు?
కో దదర్శ ప్రథమం జాయమానమస్థన్వంతం యదనస్తా బిభర్తి
భూమ్యా అసురసృగాత్మా క్వ స్విత్కో విద్వాంసముపగాత్ప్రష్టుమేతత్

.......................... ఇంకావుంది