Others

నేస్తమా..నీ పయనమెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారే సెలయేరు...
వీచే చల లగాలి.....
స్పర్శించే పచ్చాపచ్చని గడ్డి .....
వీటనన్నింటిని వదిలేసి
ఎక్కడకు నేస్తమా నీ పయనం.....

వడగాలి సోకుతుందనా?
జడివాన కురుస్తుందనా?
పచ్చపచ్చని పచ్చిక
ఎండిపోతుందనా?
ఎక్కడకు నేస్తమా నీ పయనం....

నాలో నవనవోనే్మషం
ఉన్నంతవరకూ
నీ తోడుంటుందనుకొన్నా.......

నీ వు చెప్పే
కాంతిదారుల పయనానికి
చీకటిదొంతరులను తొలగిస్తున్నా.....

నీవు చూపే
పసిడివెనె్నల ఆస్వాదనకు
పొగడపూలనేరుకుంటున్నా....
గడ్డిపూవు గుబాళిస్తుందీ
రవికిరణమూ చందనలేపనవౌతుందీ
నిత్యజీవిత రణగొణధ్వనులూ
హిందోళరాగాలౌతాయా
నీతోడుంటేనే
అపస్వరం పలికినా
శ్రుతి గతి తప్పినా
పల్లవులూ చరణాలూ అటునిటు నైనా
నీవు
నేర్పిన
అనుభవ పాఠాల సారంతో
ఒంటరి గానాన్ని బృందగానంగా
మారుస్తా.... నేస్తమా
పొగమంచు ఆవరించినా
మంచుతెరలమరినా

నీ స్నేహపరిమళంతో
జీవిత మొగ్గ
విరయబోతోందదిగో...
ఓ నేస్తమా హృదయనేస్తమా.....
నీ పయనానికి వీడ్కోలుపలికి
నా పిలుపుకు నీ పలుకు తోడునివ్వు
నేస్తమా... హృదయనేస్తమా.......

- ప్రసన్నాంజలి