Others

కంటే కూతుర్నే కనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్ను మిన్ను కానక
కౌగిళ్ళలో మునిగిన మీకు
కడుపులో నలుసుపడగానే
స్కానింగు సెంటర్ల వెంట
పరుగెడుతారు..

కడుపులో నలుసుకు
ఆకృతి రాకముందే
కన్నమ్మ అని
కడుపులోనే గొంతు నులిమేస్తారు
కాదని కంటే
కన్న తండ్రి కూడా కానివాడై పోతాడు

మాంసపుముద్ద మీద
ఎందుకమ్మా మీకింత కసి మా పైన
ఎందుకమ్మా ఆడపిల్లనగానే
మీ మనసంత కఠినమై పోతది
కన్న పేగులపైన
కనికరం చూపండి
కంటే కూతుర్నే కనండి
కలియుగంలో మేము
కానరాని రోజోచ్చేనేమోనని
భయంగా ఉంది

-ఉషశ్రీ తాల్క