Others

స్వాధ్యాయ సందోహం-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
కాని వానిని నిత్యమూ వహించే ఆ తత్త్వంలో మాంస- శల్యాదులే కానరావు. అంటే మాంస శల్యాదులు లేనిది జన్మరహితమైన ఆత్మతత్త్వం. అది మాంస శల్యాదులు కలదానిని అంటే సమస్త జీవజాలాన్ని ఆదినుండి జనింపచేసి వహిస్తూ ఉంది. అందుచేత శల్య- మాంస రహితమైన భగవత్తత్వంలో శల్య- మాంసాదులు కూడా కానరావు. ఇదే సృష్టిలోని సమస్త జీవజాలాలలో నిలిచి నేను - నాది అని పలికే ఆత్మ. శరీరం సజీవంగా ఉన్నా- మృతమైనా- అమృత శరీరమైనా అందులో అది మాత్రం కనబడదు. చిత్రమైన ఈ ఆత్మ తత్త్వాన్ని బుద్ధి ద్వారా తెలిసికోవడం అంత సులభం కదా. యమధర్మరాజు ఈ విషయానే్న నచికేతుడితో...
శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతో - పి బహవో యన్న విద్యుః
ఆశ్చర్యో వక్తా కుశలో - స్య లబ్ధా - శ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః
‘‘చాలామందికి ఈ ఆత్మతత్త్వాన్ని గూర్చి వినే అవసరమే రాదు. కనీసం దానిని గురించి విని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా కలుగదు. కొందరైతే వింటారు గాని వారికర్థమే కాదు. ఎందుకంటే వారు ప్రత్యక్షవాదులు. ప్రత్యక్షంగా ఉన్నదానిని తప్ప పరోక్షంగా ఉన్న ఏ దానిని నమ్మే స్థితిలో వారుండరు. అసలు ఈ ఆత్మను గురించి స్పష్టంగా- విపులంగా చెప్పగలవారు లోకంలో చాలాకొద్ది మంది మాత్రమే ఉంటారు. విన్నవారిలో కొందరైతే అర్థం చేసుకోగలుగుతారు. కాని సద్గురువు నుండి ఆత్మతత్త్వాన్ని సంపూర్ణంగా తెలిసికొని అనుభవంలోనికి తెచ్చుకొనగలిగేవారు మాత్రం లోకంలో నిజంగా దుర్లభమే’’ అని యముడు ఆత్మతత్త్వాన్ని కఠోపనిషత్తులో వివరించాడు.
ఉవ్వెత్తున లేచి ఎగసిపడే సముద్ర తరంగాలకు సహితం భయపడని ఓ మానవుడా! నీ అంతరంగంలో ఎగిరెగిరిపడి కల్లోపరచే ఆందోళనా తరంగాల కెందుకు భయపడతావు? వాటిని కూడా వశం చేసకో. జలధి తరంగాల రహస్యాలను నీవు కనుగొన్నావు. కాని నీలో కదిలే అంతర్మథన తరంగాల మర్మాన్ని తెలిసికోలేకున్నావు. సర్వజగద్రహస్య సారాన్ని తెలుసుకోగల్గిన నీవు నీలో గూఢంగా ఉన్న నీ గురించి నీవు తెలుసుకొనేందుకు ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు?
ఒక్క ఆత్మ గురించి సంపూర్ణంగా తెలుసుకొంటే లోకంలో తెలియరానిదేది కూడా ఉండదని వేదర్షులు ఎప్పుడో చెప్పారు. నీవే దాని పదార్థాన్ని అనే్వషిస్తూ- దానికోసమే నిరీక్షిస్తూ- దానికోసమే అంతట ఆశతో చూస్తూ పొందినా దానివల్ల నీకు పూర్తి సంతృప్తి కల్గదు. కాబట్టి ఋషుల మాటను నమ్మి ఒక్క ఆత్మను గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయి. తప్పక సఫలీకృతుడవు కాగలవు. ఆ సాఫల్యం నీలో ఒక కొత్త జ్ఞాన దీప్తులను నింపుతుంది. దానితోబాటు వైముఖ్యమే లేని అలౌకిక బ్రహ్మానందరసాన్ని కూడ నీవు నిరంతరం అనుభవించగలవు. ఆ రసాస్వాదన వలన నీవు ఎన్నడూ సన్మార్గాన్ని తప్పజాలవు. అయితే నియమపూర్వకంగా- శ్రద్ధాససితంగా ఆత్మదర్శనానికై దీర్ఘకాలం నిరంతర ప్రయత్నం చేయవలసి యుంటుంది.
ఈ సందర్భంగా ఈ వేదమంత్రమెన్నో జాగ్రత్తలను చెబుతూంది.
1. ఆత్మ తత్త్వాన్ని తెలిసికొనేందుకు ముందుగా గురువును ఆశ్రయించాలి. 2. ఆత్మ రక్త, మాంస, అస్తిరహితమైనది. అది రక్త, మాంస, అస్తి సహితమైన శరీరం కంటే భిన్నమైనది. 3. ఈ ఆత్మ అస్థి - రుధిర - మాంసమయమైన శరీరాన్ని వహిస్తుంది. 4. శరీరం పంచభూత తత్త్వాలతో నిర్మింపబడింది. 5. ఆత్మాక్వస్విత్ - ఆత్మకు ఉపాదాన కారణం లోకంలో ఎక్కడా లేదు. అలాగే నిమిత్త కారణం కూడా ఏదీ లేదు.
ఆత్మ ఉపాదాన - నిమిత్త కారణరహితమైన అకారణ తత్త్వం. అది నిత్యమైనది. నిత్య అనిత్యాలలో నిత్యమే ఆశ్రయింపదగినది.
శరీరమందున్న ఆత్మ, విశ్వవ్యాప్తమైన విరాడాత్మను తన శరీరావయవాలకంటే ఎక్కువ ప్రీతి కల్గిన రీతిగా ఆత్మీయంగా భావించాలి.
..........................ఇంకావుంది