Others

సర్వేంద్రియాణాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నుమూస్తూ కళ్లు తెరచి
చివరి కోరిక కోరాడు
‘నాకింకో డెబ్బై ఏండ్లు బతకాలని ఉందని’
కన్నుమూశాక నీకింక కళ్లతో పనేముంటుంది
ఆ కళ్లను చూపులేని
వాళ్లకెవరికైనా దానంచేసి పో
మరో డెబ్బై ఏళ్లు బతుకుతాయి
నీ కోరికా తీరుతుంది
అతని అంత్యక్రియలు ఘనంగా
జరిగాయి వసంతరుతువులో
అతని కళ్లు ఆ అమ్మాయి
కళ్లలానే ఉంటాయి
అమ్మాయి ముఖంలో ఒదిగిపోయాక
ఆ కళ్లు కనులాలై వికసించాయి
రెప్పలు గలగల్లాడినప్పుడల్లా
తూనీగలై ఎగిరాయి
రుతువుల్లో పూచాయి నిర్మలంగా నవ్వాయి
దేవుని గుడిలో ప్రవేశించినప్పుడల్లా
మూసుకొన్న ఆ కళ్లలో
మిణుగురులై కంటిపాపలు
జ్యోతిర్లింగాల్లా వెలుగుతాయి
మరో డెబ్బై ఏండ్లు
ఆ కళ్లకి ఢోకాలేదని
భరోసానిస్తాయి. *

--గుర్రాల రమణయ్య.. 9963921943